అదనపు చార్జీలు వసూలు చేస్తే గ్యాస్ ఏజన్సీలపై చర్యలు
కడప సెవెన్‌రోడ్స్ : వంట గ్యాస్ సరఫరా సమయంలో వినియోగదారుల నుంచి డెలివరీ బాయ్స్ అదనపు చార్జీలు వసూలు చేస్తే సంబంధిత వంట గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, లీగల్ మెట్రాలజీ, సివిల్ సప్లయిస్ డీటీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడారు. ఈ వారం ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారా ఫిర్యాదులు అందాయని తెలిపారు. బిల్లుపై ఉన్న ధర కంటే ఎక్కువ వసూలు చేయరాదని ఆమె ఆదేశించారు. దీన్ని అతిక్రమిస్తే సంబంధిత గ్యాస్‌ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి వివరణ ఆధారంగా పెనాల్టీ విధిస్తామని హెచ్చరించారు. డెలివరీ బాయ్స్ తప్పనిసరిగా వేయింగ్ మిషన్ తీసుకెళ్లి వినియోగదారుని కోరిక మేరకు సిలిండర్‌ను తూకం వేసి ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో దీపం సబ్సిడీ పడకపోతే వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ అనుసంధానం ఈకేవైసీ ద్వారా చేయించుకోవాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ అదితిసింగ్
Comments
Please login to add a commentAdd a comment