ద్విచక్ర వాహనానికి నిప్పు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక ఈశ్వరరెడ్డినగర్‌లో ఫైనాన్స్ వ్యాపారికి చెందిన ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈశ్వరరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రతి రోజు అతని బైక్‌ను ఇంటి ముందు పార్కింగ్ చేసేవాడు. శనివారం రాత్రి బైక్‌ను ఎప్పటిలాగే ఇంటి బయట నిలిపాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. శ్రీనివాసులు శనివారం మండల కేంద్రమైన దువ్వూరులో పలువురితో గొడవ పడ్డాడు. గొడవ పడిన వ్యక్తులే బైక్‌కు నిప్పు పెట్టి ఉంటారని అతను భావిస్తున్నాడు. శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment