
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ధర్నా
కడప సెవెన్‌రోడ్స్ : మున్సిపాలిటీలోని అప్కాస్ కార్మికులను పర్మినెంట్‌చేయాలని ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్, నాగసుబ్బారెడ్డి, యూనియన్ గౌరవాధ్యక్షులు బాదుల్లా, నగర అధ్యక్ష కార్యదర్శులు నరసింహులు, తారక రామారావులు మాట్లాడుతూ ఎన్‌డీఏ ప్రభుత్వం ఆప్కాస్‌ను రద్దు చేస్తామని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించడం అన్యాయమన్నారు. ఆప్కాస్ రద్దును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినెల ఒకశాతం కమీషన్‌తో వేతనాలు, సేవలు అందించే ఆప్కాస్‌ను రద్దు చేసి నాలుగు శాతం కమీషన్ తీసుకునే కాంట్రాక్టర్ల చేతికి లక్షా 20 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తును అప్పగించడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుంచుపాటి జాన్, ఈశ్వరయ్య, వెంకటాద్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment