
పీరయ్య అంత్యక్రియలకు హాజరైన నందమూరి రామకృష్ణ
కడప రూరల్ : నందమూరి అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు పోతుగంటి పీరయ్య ఇటీవల అనారోగ్యంతో హైదరాబాదులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం స్థానిక కృష్ణా సర్కిల్‌వద్దగల యాకుబ్ సాహెబ్ మసీదు స్మశాన వాటికలో నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు నందమూరి రామకృష్ణ హాజరయ్యారు. ఆయన వెంట గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తితోపాటు స్థానిక టీడీపీ నాయకులు గోవర్దన్‌రెడ్డి, జిలానీబాషా, హరిప్రసాద్, వైఎస్సార్‌సీపీ నాయకులు సుభాన్‌బాషా, కరీముల్లా, నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment