ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంలో ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యను విన్నారు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు, డి.టి.సి డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పి.ఎస్. డీఎస్పీ రమాకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment