సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్
జమ్మలమడుగు : ఆర్టీసీ బస్సులో సురక్షిత ప్రయాణం అంటూ ఇటీవల భద్రతావారోత్సవాలను పూర్తి చేశారు. అయితే ఈ సూత్రం ఆర్టీసీలో అమలు కావడం లేదనేందుకు ఈ సంఘటనే ఉదాహరణ. జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వేగంగా వాహనం నడిపి కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో స్పీడ్ బ్రేకర్‌ను ఎగిరించి కల్వర్టును గుద్దాడు. దీంతో బస్సు పొలాల్లోకి వెళ్లి బోల్తా కొట్టింది. ఇందులో ప్రయాణం చేస్తున్న 15 మంది ప్రయాణికులతో పాటు ఆర్టీసీ కండక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికుల కథనం మేరకు.. కొలిమిగుండ్ల మండలం హనుమంతగుండం వద్ద నుంచి డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాన్ని వేగంగా నడుపుతూ వెళ్లాడు. ఫోనులో మాట్లాడుతూ బస్సు నడపొద్దంటూ ప్రయాణికులు చెబుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కొలిమిగుండ్ల మండలంలో
జమ్మలమడుగు బస్సు బోల్తా
కండక్టర్ సహా 15 మందికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment