వేలం పాట ద్వారా రూ.18.95 లక్షల ఆదాయం
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పో తులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో సో మవారం నిర్వహించిన బహిరంగ వేలం పాటల ద్వారా రూ 18.95 లక్షలు మఠానికి ఆదాయం వచ్చినట్లు మఠం మేనేజర్ ఈశ్వరాచా రి తెలిపారు. పోలేరమ్మగుడి దగ్గర కొబ్బరికాయలు వి క్రయించుకునేందుకు రూ. 3,62,000, కొబ్బరి చిప్పలు వసూలు చేసుకునేందుకు రూ.1,90, 000, టీటీడీ వసతి గృహాల దగ్గర ఉన్న మరుగు దొడ్లు శుభ్రపరిచేందుకు రూ.5,06,000, పార్కు ఎదురుగా ఉన్న కామన్ మరుగుదొడ్ల నిర్వహణకు రూ.2,40,000, గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్ర సదనం దగ్గర ఉన్న మ రుగు దొడ్ల నిర్వహణకు రూ.2,40,000, భక్తుల పాదరక్షలు భద్రపరుచుకునేందుకు రూ.1,77,000, డార్మిటరీ నిర్వహణ కోసం రూ. 1, 80,000 వేలం పాట ద్వారా ఆదాయం వచ్చినట్లు వివరించారు.
మహిళ ఆత్మహత్య
చక్రాయపేట : మండలంలో ని సురభి దళితవాడలో పెద్దపాగ స్వాతి (23) అనే వివాహిత మంగళవారం మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆ త్మహత్య చేసుకున్నట్లు ఎస్ ఐ కృష్ణయ్య తెలిపారు. మృతురాలి పిన్నమ్మ అంజన మ్మ ఫిర్యాదు మేరకు ఆయ న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలి భర్త శ్రీధర్ జీవనోపాధి నిమిత్తం కువైట్ దేశానికి వెళ్లేందుకు నిర్ణయించుకోగా, ఇది ఇష్టంలేక స్వాతి మనస్థాపం చెంది ఉరి వేసుకుంది. మృతురాలికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తి..
ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని ఎర్రగుంట్ల రోడ్డులో ఉన్న ఏకోపార్కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పార్కు ఎదురుగా ఉన్న అటవీశాఖ స్థలంలో ఒక చెట్టుకు లుంగీని చుట్టుకొని అతను ఉరేసుకున్నాడు. స్థానికులు చూసి మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్‌ఐలు మహమ్మద్‌రఫి, వెంకటసురేష్‌లు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
సైకియాట్రీ కాన్ఫరెన్స్‌కు
డాక్టర్ లాజర్ వేపరాల
కడప ఎడ్యుకేషన్ : థాయ్‌లాండ్‌లోని బ్యాంకాగ్‌లో ఎపిసిరస్ సైంటిఫికా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8,9 తేదీల్లో జరగనున్న వరల్డ్ న్యూరోసైన్స్ అండ్ సైకియాట్రి కాన్ఫరెన్స్–2025కు యోగివేమన విశ్వవిద్యాలయం సైకాలజీ శాఖ సహ ఆచార్యులు డాక్టర్ వేపరాల లాజర్‌కు సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ నుంచి ఆహ్వానం అందింది. రెండు రోజుల సదస్సులో డాక్టర్ లాజర్ శ్రీడెమోగ్రాఫిక్ వేరియబుల్స్‌కు సంబంధించి కోవిడ్–19కు గురై కోలుకున్న వ్యక్తుల క్షేమ, మానసిక ఆందోళన్ఙ అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పిస్తారు. అంతర్జాతీయ సదస్సుకు వెళుతున్న డాక్టర్ లాజర్‌ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఫణితి ప్రకాష్ బాబు, ప్రిన్సిపల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ అభినందించారు.
వేలం పాట ద్వారా రూ.18.95 లక్షల ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment