
గ్రహణ మొర్రి నిర్ధారణ పరీక్షల శిబిరం
కడప ఎడ్యుకేషన్ : బసవతారకం, ఇండో అమెరికల్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వారి సహకారంతో సోమవారం కడప సమగ్రశిక్ష కార్యాలయంలో గ్రహణ మొర్రి నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరాన్ని సమగ్రశిక్ష స్ట్రేట్ ట్రైనింగ్ అండ్ ప్రోగ్రాం ఆఫీసర్ కల్పన శైల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బసవతారకం హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ ముకుందరెడ్డి వైద్యసేవలందించారు. 11 మంది బాధితులు హాజరై పరీక్షించుకున్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు, ఐఈఆర్టీలు పాల్గొన్నారు.
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
చింతకొమ్మదిన్నె : ఆత్మహత్యకు యత్నించిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లుచింతకొమ్మదిన్నె ఏఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు. గోపాలపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి భార్య గజ్జల యశోద కిందపడి వెన్నెముక ఆపరేషన్ చేయించుకుంది. ఆ నొప్పి భరించలేక 8వ తేదీ విష ద్రావణం తాగింది. కర్నూలులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు, మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment