ఎన్టీఆర్‌ వైద్యసేవకు..గడ్డుకాలం ! | - | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ వైద్యసేవకు..గడ్డుకాలం !

Published Tue, Mar 11 2025 1:48 AM | Last Updated on Tue, Mar 11 2025 1:48 AM

ఎన్టీ

ఎన్టీఆర్‌ వైద్యసేవకు..గడ్డుకాలం !

కడప రూరల్‌ : అనారోగ్యంతో ఉన్న పేదల జీవితాల్లో ఆరోగ్య వెలుగులు నింపే బృహత్తర పథకం ‘డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ’కు గడ్డుకాలం వచ్చింది. నాడు ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ’ ద్వారా పథకం పటిష్టవంతంగా మారింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ‘డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ’గా మార్పు చేసింది. పేరు మార్పుతో పాటే పథకం అమలు అస్తవ్యస్తంగా సాగుతోంది. ఏకంగా అందులో పనిచేసే సిబ్బంది తమ ఉద్యోగ భద్రత కోసం ఆందోళన బాట పట్టడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం అదుపుతప్పింది. అటు సిబ్బందికి అభద్రతాభావం ఏర్పడింది. ఇటు పేదలకు దీని అమలుపై అనుమానపు నీడలు కమ్మాయి. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది మరో మారు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధం అయ్యారు.

పథకం విచ్ఛిన్నానికి పన్నాగాలు

sîæyîlï³ MýS*rÑ$ {糿¶æ$™èlÓ… Æ>Ð]lyýl…™ø¯ól yéMýStÆŠ‡ OÐðlGÝëÞÆŠ‡ BÆøVýSÅ} ç³£ýlM>°² yéMýStÆŠ‡ G±-t-BÆŠ‡ OÐðl§ýlÅ õÜÐ]lV> õ³Æý‡$ Ð]l*Æý‡ayýl… A…§ýl-ÇMîS ™ðlÍ-íÜ…§ól. M>V> õ³Æý‡$ Ð]l*Æý‡$µ-™ø-´ër$ C…§ýl$ÌZ MýS*yé A¯]l*çßæÅOÐðl$¯]l Ð]l*Æý‡$µ-ÌS¯]l$ ¡çÜ$MýS$ B…§øâýæ¯]l MýSÍW-Ýù¢…-¨. A…§ýl$ÌZ ¿êVýS…V> Mö°² Æ>[ÚëtÌZÏ AÐ]l$ÌZÏ E¯]l² BĶæ¬-ÚëïŒS ¿êÆý‡™Œæ ç³£ýl-M>°² Æ>çÙ‰…ÌZ MýS*yé ¡çÜ$-Mö_a §é°MìS ½Ð]l*¯]l$ A¯]l$-çÜ…-«§é¯]l… ^ólĶæ$-yé°MìS {糿¶æ$™èlÓ… ^èlÆý‡ÅË$ ^ólç³rtyýl… Ððl¬§ýlË$ ò³sìæt…-¨. ©…™ø HâýæÏ ™èlÆý‡-ºyìl BÆøVýSÅ-}° ¯]lÐ]l¬ÃMýS$° ç³°^ól-çÜ$¢¯]l² BÆø-VýSÅ-Ñ$-{™èlÌZÏ (¯ólyýl$ OÐðl§ýlÅ Ñ${™èlË$) B…§øâýæ¯]l Ððl¬§ýl-OÌñæ…-¨. BÆøVýSÅ} C¯ŒS-{çÜ*-ె¯ŒSÞ ç³Ç-«¨-ÌZMìS Ððlã™ól B çÜ…çܦMýS$ ^ðl…¨¯]l ÐéÆý‡$ ™èlÐ]l$¯]l$ ¡íÜ-ÐólíÜ Ð]l$Æö-MýS-Ç° °Ä¶æ$-Ñ$-Ýë¢Æý‡¯ól Ðé§ýl¯]l ºÌS…V> Ñ°-í³-Ýù¢…-¨. ÐéçÜ¢-Ðé-°MìS fÇVóS¨ MýS*yé A§ól M>Ð]l-yýl…™ø ç³°-^ólçÜ$¢¯]l² E§øÅVýS$ÌZÏ A¿ýæ-{§ýl™èl ¯ðlÌS-Mö…¨. ©°MìS-™øyýl$ D OÐðl§ýlÅ õÜÐ]lË$ ½Ð]l* ç³Ç«¨-ÌZMìS Ððlã™ól ÐéÅ«§ýl$ÌS çÜ…QÅ-™ø-´ësôæ ´ëÅMóSi VýS×æ-±-Ķæ$…V> ™èlVýSY-¯]l$…-¨. ©…™ø BÆø-VýSÅ-}ÌZ E…yól {ç³Äñæ*-f¯éË$, ½Ð]l* Ð]lÌSÏ Ð]l^óla Eç³-Äñæ*-V>Ë$ HÐ]l*{™èl… E…yýl-Ð]l¯]l²¨ çܵçÙt…V> AÆý‡¦-Ð]l$-Ð]l#-™ø…-¨.

కొలిక్కిరాని చర్చలు

డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రలు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమ ఉద్యోగ భద్రత, వేతనాల పెంపుకోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నిరవధికంగా సమ్మెకు వెళ్లడానికి సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. దీంతో 2024 నవంబరు 13వ తేదీన ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు సీఈఓ డాక్టర్‌ డి.లక్ష్మిషాతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేదు. ఈ సందర్బంగా సీఈఓ లక్ష్మిషా కొద్దిరోజులు ఆగమని చెప్పడంతో ఎన్టీఆర్‌ వైద్య సేవ సిబ్బంది ఓపిక పట్టారు. నెలలు గడుస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మళ్లీ ఆందోళన బాట పట్టడానికి శ్రీకారం చుట్టారు.

వైస్సార్‌ సీపీ పాలనలో ఉద్యోగ భద్రతకు చర్యలు

వైఎస్సార్‌ సీపీ పాలనలో ఆరోగ్యశ్రీలో పనిచేసే సిబ్బంది ఉద్యోగ భద్రతకు, వేతనాల పెంపునకు చర్యలు చేపట్టారు. ఆ మేరకు టీం లీడర్లను సీనియర్‌ అసిస్టెంట్లుగా, ఆరోగ్యమిత్రలను జూనియర్‌ అసిస్టెంట్‌ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పరిగణించడంతోపాటు అందుకు తగిన వేతనాలు మంజూరు చేయాలని సంకల్పించింది. తద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆరోగ్యశ్రీలో పనిచేసే సిబ్బందికి కూడా ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంది. ఆ ప్రకారం ఫైల్‌ నంబరు 1334631 సిద్ధమైంది. ఇందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో ఆరోగ్యమిత్రల్లో సంతోషం నెలకొంది. అంతలోనే ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ ఫైలును పూర్తిగా ప్రక్కన పడేసిందని సిబ్బంది వాపోతున్నారు.

జిల్లాలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ వివరాలు

2007లో ‘ఆరోగ్య శ్రీ’కి శ్రీకారం..

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా 2007–08లో పేదలకు ఉచిత వైద్యానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా నిరుపేదలు ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సునాయాసనంగా ఉచిత వైద్య సేవల ద్వారా పునర్జన్మను పొందారు. అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేశారు. నిరుపేదలకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా చీకు చింత లేకుండా ఒక్కపైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యసేవలు పొందడం ద్వారా నిశ్చితంగా జీవనం సాగిస్తున్నారు. అలాంటి గొప్ప పథకానికి టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో బీటలు పడడం ప్రారంభమైంది.

ఊగిసలాటలో ఉచిత ‘వైద్య సేవ’

సమస్యల పరిష్కారానికి

సిబ్బంది ఆందోళన

12న ‘ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌’సీఈఓతో చర్చలు

అనంతరం కార్యాచరణకు సన్నద్ధం

వైద్య మిత్రులు, ఇతర సిబ్బంది 115 నెట్‌వర్క్‌ ఆస్పత్రులు 108 ఆరోగ్యశ్రీ కార్డులు 5.10 లక్షలకు పైగా వ్యాధుల సంఖ్య పెంపు వివరాలు

2007 (మొదటి విడత) 542

2008 (రెండో విడత) 1,040

2021 2434

2022 3255

విధుల బహిష్కరణను తాత్కాలికంగా వాయిదా వేశాం...

ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10, 17, 24 తేదీల్లో విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చాం. ప్రతి సోమవారం రోజున విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టాలని నిర్ణయించాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వనించింది. ఆ మేరకు ఈ నెల 12వ తేదీన డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సీఈఓ పీ రవిసుభాష్‌తో చర్చలు ఉన్నాయి. అందువల్ల ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేశాం. చర్చల అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తాం. – విజయ్‌, జిల్లా అధ్యక్షుడు, డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ, వైద్యమిత్రల సంఘం

No comments yet. Be the first to comment!
Add a comment
ఎన్టీఆర్‌ వైద్యసేవకు..గడ్డుకాలం ! 1
1/2

ఎన్టీఆర్‌ వైద్యసేవకు..గడ్డుకాలం !

ఎన్టీఆర్‌ వైద్యసేవకు..గడ్డుకాలం ! 2
2/2

ఎన్టీఆర్‌ వైద్యసేవకు..గడ్డుకాలం !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement