పదిలో అగ్రస్థానమే లక్ష్యం
? జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ఎంతమంది విద్యార్థులు రాస్తున్నారు
డీఈఓ : జిల్లావ్యాప్తంగా 593 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 27,800 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలను రాస్తున్నారు. ఇందులో 14,330 మంది బాలురు, 13,470 మంది బాలికలున్నారు.
? ఎన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు
డీఈఓ : ఈనెల 17 నుంచి జిల్లా వ్యాప్తంగా 161 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాం. ఇందుకోసం ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమావేశం నిర్వహించి నిర్వహణపై సూచనలు, సలహాలను ఇచ్చాం.
? ఎలాంటి ఫలితాలను అంచానా వేస్తున్నారు
డీఈఓ : పదోతరగతి ఫలితాల్లో వైఎస్‌ఆర్ జిల్లాకు చక్కటి రికార్డు ఉంది. గతంలో పలుమార్లు రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ యేడాది కూడా నంబర్‌వన్‌గా నిలిచేందుకు కృషి చేస్తున్నాం.
? ఫలితాల మెరుగునకు ఎలాంటి చర్యలు చేపట్టారు
డీఈఓ : పదో తరగతి ఫలితాలు మెరుగు పరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ప్రతిరోజూ విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణతో పాటు సిలబస్ సకాలంలో పూర్తి చేయడం, ప్రీఫైనల్ పరీక్షల ఫలితాల ఆధారంగా పాఠశాల విద్యార్థుల స్థాయిని అంచనా వేసి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించేలా మార్గనిర్దేశం చేశాం. విద్యార్థులు ఎలా చదువుతున్నారో నిత్యం ఉపాధ్యాయుల ద్వారా ఫీడ్‌బాక్ తీసుకుంటున్నాం.
? కేంద్రాల్లో సౌకర్యాల గురించి..
డీఈఓ : ఇప్పటికే పరీక్షా కేంద్రాలను గుర్తించి, కేంద్రంలో విద్యార్థులకు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. మాస్‌కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాం.
? గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు
డీఈఓ : గ్రామీణ, దూర ప్రాంత విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా అధికారులు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్‌టికెట్ చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
? జిల్లాలో ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాం
డీఈఓ : జిల్లావ్యాప్తంగా ఆరు పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించాం. ఇందులో కమలాపురం, బి.మఠం, బి.కోడూరు, కొండాపురం, వేంపల్లి, సింహాద్రిపురం జిల్లా పరిషత్తు హైస్కూల్స్‌ను గుర్తించాము. వీటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం
? పరీక్షల విధుల్లో ఎంతమంది స్క్వాడ్ బృందాలు, ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు
డీఈఓ : జిల్లా వ్యాప్తంగా 161 పరీక్షా కేంద్రాల్లో 1300 మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. వీరితో పాటు 161 మంది ఛీప్ సూపరింటెండెంట్లు, 161 మంది డిపార్టుమెంట్ ఆఫీసర్లను నియమించాం.
పదోతరగతి ఫలితాల్లో మన జిల్లా అగ్రస్థానం సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించిందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ స్పష్టం చేశారు.వ ఇందుకోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు ప్రత్యేక ప్రణాళికతో ముందుకువెళ్తున్నట్లు అయన తెలిపారు. ఇటీవల ప్రీఫైనల్ పరీక్షలను పూర్తి చేశామని, అందులో వెనుకబడిన వారిపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అయన తెలిపారు. పది ఫలితాలపై ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. – కడప ఎడ్యుకేషన్
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
డీఈఓ డాక్టర్ షేక్ షంషుద్దీన్
పదిలో అగ్రస్థానమే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment