విద్యుత్ శాఖ పురోభివృద్ధిలో లైన్‌మెన్ల పాత్ర కీలకం
– కడప ఆపరేషన్ ఈఈ హరిసేవ్యా నాయక్
కడప కార్పొరేషన్ : విద్యుత్ శాఖ పురోభివృద్ధిలో లైన్‌మెన్ల పాత్ర ఎంతో కీలకమని కడప ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ అన్నారు. మంగళవారం లైన్‌మెన్ దివస్ సందర్భంగా కడప డివిజన్ కార్యాలయంలో ఓ అండ్ ఎం స్టాఫ్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, కేక్ కత్తిరించి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా హరిసేవ్యా నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఽఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా లైన్‌మెన్లను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించి 2021 సంవత్సరం నుంచి ప్రతిభ చూపిన లైన్‌మెన్లకు అవార్డులు ఇస్తోందన్నారు. జిల్లాలో ఉన్న లైన్‌మెన్లు కూడా ఈ అవార్డులు తీసుకునేందుకు పోటీ పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న యూనియన్ సభ్యులు, భారీ సంఖ్యలో ఎనర్జీ అసిస్టెంట్లు, జేఎల్‌ఎంలు, లైన్‌మెన్లు పాల్గొన్నారు.
ఒంటిమిట్ట ఆలయంలో పనులకు పురావస్తు శాఖ కొర్రీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం, ఇత్తడి రేకు తొడుగు మార్పు పనులపై కేంద్ర పురావస్తుశాఖ అధికారులు నేటికీ అనుమతులు ఇవ్వలేదు. బుధవారం నుంచి మహా సంప్రోక్షణ ఉత్సవాలు జరగనుండగా పురావస్తు శాఖ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేసింది. అయితే ఒంటిమిట్ట రామాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం, స్వర్ణ రంగు పొయ్యి అంద వికారంగా దర్శనమిస్తున్నాయి. దీంతో వాటిని అందంగా స్వర్ణ రంగుతో తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ అనుమతులు వస్తాయనుకున్న టీటీడీ అధికారులు ధ్వజ స్తంభం చుట్టూ ఇనుప పైపులతో సారవ కట్టించారు. కానీ పురావస్తు శాఖ అనుమతులు రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment