కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షతో ఉజ్వల భవిష్యత్త
కడప ఎడ్యుకేషన్ : దేశవ్యాప్తంగా జరిపే సెంట్రల్ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష– 2025 (సీయూఈటీ అండర్ గ్రాడ్యుయేట్ 2025)తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రవీంద్రనాథ్ పేర్కొన్నారు. దేశంలోని 190కి పైగా సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ప్రైవేటు డీమ్డ్ టు బీ యూనివర్సిటీలలో, ఐకార్ అనుబంధ వ్యవసాయ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం కోసం జరిపే ఈ పరీక్ష ద్వారా విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. మంగళవారం కడప ఆర్ట్స్ కళాశాలో సర్ సీవీ రామన్ సైన్స్ క్లబ్, విద్యా భారతి ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను అధ్యాపకులతో కలిసి ప్రిన్సిపాల్ ఆవిష్కరించారు. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైందన్నారు. మార్చి 22వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కొనసాగుతుందన్నారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆన్‌లైన్‌లో వెబ్‌నార్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాభారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పత్తి వెంకట కృష్ణారెడ్డి, సైన్సు క్లబ్ గౌరవాధ్యక్షుడు గునిశెట్టి శ్రీనివాసులు, గౌరవ సలహాదారు డాక్టర్ బి.రామచంద్ర, అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులరెడ్డి, కార్యదర్శి విజయప్రసాద్, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్, అధ్యాపకులు డాక్టర్ సావిత్రి, డాక్టర్ రవి, డాక్టర్ నీలయ్య, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment