ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : రోజువారి కష్టార్జితంపై ఆధారపడి జీవిస్తున్న ఆటో కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ అనుబంధ ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ అధిక వడ్డీలకు తెచ్చుకుని ఆటోలు నడుపుతున్న పేద వర్గాల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు పి.సుబ్బరాయుడు, ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కడప నగర అధ్యక్ష, కార్యదర్శులు పుల్లయ్య, నారాయణ, నగర నాయకులు సుబ్బరాయుడు, నాగిరెడ్డి, అంకుశం, రెడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment