ప్యాసింజర్ రైలు పొడిగింపు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఈనెల 8వ తేదీ వరకు కుంభమేళాకు నడవాల్సి ఉన్న తిరుపతి–హుబ్లి–తిరుపతి (57401/57402) ప్యాసింజర్ రైలును ఈనెల 15వరకు పొడిగించినట్లు కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. తిరుపతి–హుబ్లి మధ్య 8 నుంచి 15వ తేదీ వరకు, హుబ్లీ–తిరుపతి మధ్య 9వ తేదీనుంచి 16వ తేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేశారన్నారు. తిరిగి 15, 16 తేదీలనుంచి ఈ రైళ్లు యథావిధిగా నడుస్తాయని ఆయన వివరించారు.
ఫార్మసిస్ట్‌లకు
ఉద్యోగ భద్రత కల్పించాలి
కడప కార్పొరేషన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్ట్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల సురేష్ బాబు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతి మెడికల్ స్టోర్‌లో ఫార్మసిస్ట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. కానీ మెడికల్ స్టోర్‌లో అర్హత లేని సిబ్బందితో మందులు ఇప్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు ఈ విషయమై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ప్రతి మెడికల్ స్టోర్‌లో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పడే డ్రగ్ మాఫియాను అరికట్టవచ్చన్నారు.
కారుబోల్తా
ముద్దనూరు : ముద్దనూరు–కడప జాతీయ రహదారిలో తిమ్మాపురం సమీపంలో ప్రమాదవశాత్తు కారు బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు తాడిపత్రి నుంచి ప్రయాణిస్తు కారు టైరు పగిలి అదుపుకాలేక రహదారి పక్కకు వెళ్లి బోల్తాపడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment