రోడ్డు భద్రతా ఆంక్షలు కఠినతరం
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో రోడ్డు భద్రత చర్యల ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్, కమిటీ చైర్మన్ శ్రీధర్ చెరుకూరితోపాటు ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, కమిటీ మెంబర్ కన్వీనర్ ఇంచార్జి డీటీసీ కె. ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన రహదారుల్లో డివైడర్లను బ్రేక్ చేసి వాహన ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్న వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలన్నారు. రియల్టర్లు, రాజకీయ ప్రమేయాలకు స్పందించకుండా రోడ్డు భద్రతా ఆంక్షలను కఠినతరం చేయాలన్నారు. ఇంజనీరింగ్ శాఖల వారీ గా వారి సంబంధిత రహదారులపై తాజాగా జరిగిన ప్రమాదాలను విశ్లేషించి, వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో.. 108 వాహన సేవలు సకాలంలో అందేలా సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యా సంస్థల వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు, అలాగే ప్రతి పెట్రోల్ బ్యాంకులు, కమర్షియల్ కాంప్లెక్స్ ల వద్ద సీసీ కెమేరా లను ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు. అతివేగం, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, పరిమితికి మించి ఆటోలు నడపడం, బస్సులు ఇతర వాహనాలలో అధిక లోడుతో సరుకు, ఇతర సామగ్రి రవాణా చేసే వారిపై.. కఠిన చర్యలు తీసుకోవలసిందిగా రవాణ శాఖ అధికారులను ఆదేశించారు. అంతర్ జిల్లా సరిహద్దుల చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దష్టి సారించి కేసులు ఫైల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కె. ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, పీఆర్ ఎస్‌ఈ శ్రీనివాసులు రెడ్డి, డీఎంహెచ్‌ఓ నాగరాజు, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు, కమిటీ సభ్యులైన రోడ్ సేఫ్టీ ఎన్జీవో, విద్యుత్ శాఖల ఎస్.ఈ.లు, మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు, ట్రాఫిక్, పోలీసు, రవాణా శాఖ అధికారులు, రోడ్డు భద్రత ఎన్‌జీఓల ప్రతినిధులు, కమీటీ సభ్యులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ట చర్యలు
మత్తుపదార్థాల వినియోగం, విక్రయాలు, రవా ణాను అరికట్టడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీసీ హాలులో జిల్లాలో మత్తు పదా ర్థాల నివారణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అదితి సింగ్ లతో కలిసి కలెక్టర్ జిల్లా స్థాయి యాక్షన్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల మూల సరఫరా రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
Comments
Please login to add a commentAdd a comment