మహిళలు యోగాసనాలు అభ్యసించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్: మహిళలు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఎదిగేందుకు యోగా చాలా ఉపయోగపడుతుందని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలక్ష్మి, స్టెప్ సీఈఓ సాయిగ్రేస్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం నగరంలోని నబీకోటలో ఉన్న మహిళా శక్తికేంద్రంలో అంగన్వాడీ వర్కర్లు, మెప్మా పరిధిలోని మహిళా సంఘాలకు యోగ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల్లో ఒత్తిడిని నివారించాలంటే యోగా ఉపయోగపడుతుందన్నారు. యోగా నిపుణులు డాక్టర్ ఆర్.రంగనాథరెడ్డి పలు సూచనలు చేశారు. అనంతరం మహిళలచేత యోగాసనాలు చేయిస్తూ వాటి ప్రయోజనాలు, శాసీ్త్రయ దృక్పథాన్ని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment