శాసనసభలో ఎమ్మెల్సీ
రామచంద్రారెడ్డి డిమాండ్
కడప కల్చరల్ : కడప నగరంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రానికి అదనపు భవనాలను వెంటనే నిర్మించేందుకు తగిన చర్యలు చేపట్టాలని శాసనమండలి సభ్యులు ఎంవీ రామచంద్రారెడ్డి బుధవారం రాష్ట్ర శాసనమండలిలో డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మండలి స్పీకర్‌కు ఈ విషయాన్ని విన్నవించారు. కడప నగరంలోని బ్రౌన్ గ్రంథాలయం, భాషా పరిశోధన కేంద్రానికి ప్రతిరోజు వందలాది మంది పాఠకులు వస్తుంటారని, ముఖ్యంగా ఉద్యోగార్థులు తమ విజ్ఞానాన్ని పెంచుకునేందుకు, పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు గ్రంథాలయంలోని పుస్తకాలను పరిశీలిస్తుంటారని తెలిపారు. ఈ గ్రంథాలయం భవనాలను మరింతగా విస్తరించేందుకు అవసరమైన స్థల సేకరణ, భవన నిర్మాణాల కోసం గత ప్రభుత్వం రూ. 6.80 కోట్లు మంజూరు చేసిందని, కానీ ఇంతవరకు నిర్మాణ పనులను సంబంధిత అధికారులు చేపట్టడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేలా చూడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment