కడప ఎడ్యుకేషన్ : వికసిత్ భారత్ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ –2025 అనే కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశం కోసం ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు నెహ్రు యువ కేంద్ర జిల్లా యువ అధికారి కె.మణికంఠ ఒక ప్రకటనలో తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లాలలో 18 –25 ఏళ్లలోపు గల యువత ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశం పై ఈ ఉపన్యాస పోటీలు ఉంటాయని చెప్పారు. జిల్లాలో గెలుపొందిన విజేతలకు రాష్ట్ర, దేశ స్థాయిలలో పోటీలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర, దేశ స్థాయిలో గెలిచిన విజేతలకు నగదు బహుమతులు ఉంటాయన్నారు. జిల్లా స్థాయి పోటీలు ఈ నెల 15 వ తేదీన కడపలోని కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఫిజికల్ మోడ్‌లో జరుగుతుందని వివరించారు. ఈ ఉపన్యాస పోటీలలో పాల్గొనదలచిన వారు ముందుగా మై భారత్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకొని ఒక నిమిషం వీడియో అప్లోడ్ చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 9177616677 నెంబర్‌తో పాటు కేఎస్‌ఆర్‌ఎం కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ స్ ప్రోగ్రాం ఆఫీసర్ లక్షుమయ్యను సంప్రదించాలని ఆయన సూచించారు.
నెహ్రూ యువ కేంద్ర
జిల్లా యువ అధికారి మణికంఠ
Comments
Please login to add a commentAdd a comment