కువైట్‌లో అడుసువారిపల్లె వాసి మృతి
గోపవరం : మండలంలోని బ్రాహ్మణపల్లె పంచాయతీ అడుసువారిపల్లె గ్రామానికి చెందిన వంతెరపల్లె రమణారెడ్డి (54) కువైట్‌లో మృతి చెందాడు. ఇతను బతుకుదెరువు కోసం గత కొన్నేళ్లుగా కువైట్‌లో ఉన్నాడు. రోజువారి కూలి పనులు చేసుకుంటుండగా మూడు నెలల క్రితం ప్రమాదవశాత్తు ఇనుపరాడ్లు మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కువైట్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 3వ తేదీన మృతి చెందాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. కువైట్ నుంచి మృతదేహం గురువారం ఉదయం స్వగ్రామం చేరుకుంది. అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అతిగా మద్యం తాగి
యువకుడు..
ముద్దనూరు : మద్యానికి బానిసగా మారిన బుల్లి అశోక్ (32) అనే యువకుడు గురువారం మండలంలోని కొత్తపల్లె గ్రామ శివారులో సున్నపురాళ్లపల్లె బస్‌స్టాప్ వద్ద మృతి చెందాడు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం భద్రంపల్లె గ్రామానికి చెందిన అశోక్‌కు పదేళ్ల క్రితం కర్నూలు జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన సునీత అనే మహిళతో వివాహమైంది. మూడేళ్ల క్రితం అతని భార్య ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన అశోక్ మద్యానికి బానిస అయ్యాడు. ఈనెల 5వతేదీన తన భార్య వద్దకు వెళ్లి వస్తానని చెప్పి అశోక్ ఇంటినుంచి బయలుదేరాడు. అయితే గురువారం సున్నపురాళ్లపల్లె వద్ద పడిపోయి ఉండడంతో పోలీసులు గుర్తించారు. అతిగా మద్యం తాగడం వల్లగానీ, మరే ఇతర కారణంతోనైనా అశోక్ మరణించి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వాసాలు అక్రమ నిల్వపై
రూ.52 వేలు జరిమానా
ముద్దనూరు : జమ్మలమడుగులోని రామిరెడ్డిపల్లె రహదారిలో బుధవారం పోలీసులు గృహ నిర్మాణానికి వినియోగించే వాసాలను స్వాధీనం చేసుకుని అటవీశాఖకు అప్పగించారు. 38 వాసాలు అక్రమంగా కలిగి ఉండటంతో రూ. 52 వేలు జరిమానా విధించినట్లు ముద్దనూరు ఫారెస్టు రేంజి అధికారి అశోక్‌కుమార్ గురువారం తెలిపారు.
ఆటో బోల్తా
మదనపల్లె : ఆటో బోల్తా పడి డ్రైవర్ గాయపడిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. ఎర్రమద్దివారిపల్లెకు చెందిన సుబ్బయ్య కుమారుడు రమేష్(26) సొంతంగా ఆటో నడపడమే కాకుండా స్థానికంగా ఓ మామిడి తోట వద్ద కాపలాగా ఉన్నాడు. గురువారం వ్యక్తిగత పనులపై ఆటోలో అంగళ్లుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఓ మలుపు వద్ద ఆటో వేగాన్ని అదుపుచేయలేకపోవడంతో బోల్తా పడింది. ప్రమాదంలో రమేష్ గాయపడగా, స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కువైట్‌లో అడుసువారిపల్లె వాసి మృతి
Comments
Please login to add a commentAdd a comment