పోలీసు జాగిలాల సేవలు అభినందనీయం
కడప అర్బన్ : పోలీస్ జాగిలాలు ‘వాఘా’, ‘ఝాన్సీ’ అనే జాగిలాలు 11 సంవత్సరాల పాటు విశిష్ట సేవలను అందించి, పలు కీలక విధులను సమర్థవంతంగా నిర్వర్తించడం అభినందనీయమని జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం స్థానిక ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ‘వాఘా’, ఝాన్సీ’ జాగిలాల పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పేలుడు పదార్థాలను గుర్తించడంలో నేర్పరులుగా పేరుగాంచిన లాబ్రడార్, రీట్రీవర్ జాతికి చెందిన జాగిలాలు ‘వాఘా’, ఝూన్సీలను అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు, అదనపు ఎస్పీ (ఏఆర్) బి. రమణయ్య శాలువాలను కప్పి ఘనంగా సన్మానించారు. సుదీర్ఘకాలంపాటు పోలీసుశాఖలో విధులను నిర్వర్తించి, పదవీ విరమణ సందర్భంలో కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, చురుగ్గా వుండేలా కంటికి రెప్పలా చూసుకున్న హ్యాండ్లర్‌లు డి. పీరయ్య (ఏఆర్‌పీసీ 2342), బి.వి కృష్ణయ్య (ఏఆర్‌పీసీ 3093)లను, బి.వి కృష్ణయ్య (ఏ.ఆర్ పీసీ 3093)లను అదనపు ఎస్పీ ప్రత్యేకంగా శాలువా కప్పి అభినందించారు. అదనపు ఎస్పీ (ఏఆర్) బి. రమణయ్య మాట్లాడుతూ 2013 డిసెంబర్ 1న జన్మించిన ‘వాఘా’, 2014 సెప్టెంబర్ 9న జన్మించిన ఝాన్సీ ఏడాదిపాటు శిక్షణ పొందిన తరువాత జిల్లా పోలీసు శాఖలో సేవలను ప్రారంభించాయన్నారు. ‘వాఘా’; ‘ఝాన్సీ’లను మేళతాళాలతో బాణసంచా కాల్చుతూ వాటి విడిది గృహాల వద్దకు చేరి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. డీఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్‌ఐలు శివరాముడు, వీరేష్, శ్రీశైల రెడ్డి, టైటస్, ఆర్‌ఎస్‌ఐలు, బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ టీం, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
‘వాఘా’, ‘ఝాన్సీ’లకు ఘనంగా వీడ్కోలు
పోలీసు జాగిలాల సేవలు అభినందనీయం
Comments
Please login to add a commentAdd a comment