చాపాడు : మండల పరిధిలోని అయ్యవారిపల్లెకు చెందిన పాలూరు లక్ష్మీ(35) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 2న పాలూరు లక్ష్మీతో ఆమె ఆడ బిడ్డ దేవి గొడవ పడింది. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మీ విషపు గుళికలను మింగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. ఈ ఘటనకు కారకురాలైన దేవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతిపై కేసు నమోదు
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండలం, గువ్వలచెరువు ఘాట్ నాల్గవ మలుపు వద్ద లారీ లోయలో పడి ముగ్గురు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.బెంగళూరు నుంచి ఏలూరుకు చేపల ఫీడ్ లోడుతో కడప వైపు వస్తున్న ఏపీ 35 డబ్ల్యు 2989 నెంబరుగల లారీ వేగాన్ని అదుపు చేసుకోలేక లైనింగ్ వాల్‌ను ఢీకొట్టి లోయలో పడిపోయిన విషయం విదితమే. లారీ డ్రైవర్ తన్నేరు సాంబయ్య(30), క్లీనర్ తన్నీరు నాగరాజు(24) లారీ కాబిన్‌లో ఇరుక్కుపోయి మృతి చెందారు. అదే లారీలో గువ్వలచెరువు వద్ద ఎక్కి ప్రయాణిస్తున్న చక్రాయపేట మండలం కుప్పగుట్టపల్లె నివాసి కొవ్వూరు వివేకానందరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో కడప రిమ్స్‌కు తరలించగా అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు చనిపోయాడు. ఈ ప్రమాదంపై చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గురువారం మృతదేహాను వారి బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment