ఆకట్టుకున్న ఆయుధాల ప్రదర్శన
కడప అర్బన్ : విద్యార్థులను పోలీస్ ఆయుధాల ప్రదర్శన ఆకట్టుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ గురువారం పాఠశాల విద్యార్థుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వినియోగించే ఆయుధాలు, దుస్తులు, పనిముట్లు, నేరదర్యాప్తు విధానం తదితర విషయాలను విద్యార్థులకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాంబు డిస్పోజబుల్ టీం, ఫింగర్‌ప్రింట్, పోలీస్ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్స్, ఆయుధాల విడి భాగాల సమాచారం(ఏకె–47, విల్ పిస్టల్, గ్లో17, కార్బన్, ఇన్సాఫ్ రైఫిల్, గ్యాస్‌గన్, గ్రేనేడ్, ఫోరెన్సిక్, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్) తదితర విషయాలపై వివరించారు. బాడీవోర్న్ కెమెరాలు, డ్రోన్ కెమెరా, వీహెచ్‌ఎఫ్ సెట్, రోబో డ్రెస్, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, బాంబు డిస్పోజల్ టీం, వినియోగించే డీఫ్ సెర్చ్ మెటల్ డిటెక్టర్ (డీఎస్‌ఎండీ), టెలిస్కోప్ మ్యానిపులేటర్, రిమోట్ వైర్ కట్టర్‌లను ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్‌బాబు, ఏ.ఆర్. అదనపు ఎస్పీ బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్‌ఐ ఆనంద్, కడప నగరంలోని పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment