ఉద్యాన పంటలపై అవగాహన పెంచాలి
కడప అగ్రికల్చర్ : ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన పెంచాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి సుభాషిణి సూచించారు. గురువారం కడప కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయశాఖ మీటింగ్ హాల్‌లో గ్రామ ఉద్యాన సహాయకులకు ఉద్యాన పంటలు, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ ప్లాన్‌సై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ఊటుకూరు కేవీకే శాస్త్రవేత్త మానస, ఏపీ ఎంఐపీ పీడీ వెంకటేశ్వరరెడ్డి, ఉద్యానశాఖ అధికారులు, డిజిటల్‌గ్రీన్ సిబ్బంది, గ్రామ ఉద్యాన డిజిటల్ గ్రీన్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి మాట్లాడుతూ ఉద్యాన పథకాలు అమలు చేసే విధానాన్ని ప్రతి రైతుకు చేరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంకేతిక ఉద్యానశాఖ అధికారి జ్యోతిర్మయి, ఉద్యానశాఖ అధికారి జయభరత్‌రెడ్డి, డిజిటల్ గ్రీన్ సిబ్బంది వెంకటగౌడ్, సహాయకులు ప్రవీణ్, గ్రామ ఉద్యాన సహాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment