నిత్యపూజకోనకు ఆర్టీసీ బస్సు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రముఖ శైవ క్షేత్రమైన నిత్యపూజకోనకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసును నడుపున్నామని ఆర్టీసీ కడప డిపో మేనేజర్ డిల్లీశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు కడప ఆర్టీసీ బస్టాండు, పాత బస్టాండ్, కృష్ణ సర్కిల్, శంకరాపురం, అప్సర సర్కిల్, చిన్న చౌక్, రామాంజనేయ పురం, భాకరాపేట ,సిద్ధవటం, ఎస్. రాజంపేట, వంతాటిపల్లె, ఆవులసత్రం మీదుగా నిత్యపూజకోనకు వెళుతుందన్నారు. ఈనెల 10వ తేదీన ఉదయం 07:00 గంటలకు కడప నుంచి బయలుదేరుతుదని, తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:30 –3.00 గంటల మధ్య (భక్తుల రద్దీ అధారంగా )పంచలింగాల నుంచి బయలుదేరి కడపకు చేరుతుందన్నారు. చార్జి రూ. 40గా నిర్ణయించామని తెలిపారు.
పొలంలో కేబుల్ వైర్ల చోరీ
ఖాజీపేట : రైతుల పొలాల్లో కేబుల్ వైర్ల చోరీ చేసే దొంగలు మళ్లీ తమ చేతి ప్రతాపం చూపిస్తున్నారు. శుక్రవారం కన్నెలవాగు చెరువుకు వెళ్లే మార్గ మధ్యలోని ఇద్దరు రైతుల పొలాల్లో కేబుల్ కట్‌చేసి కాపర్ వైర్‌ను చోరీ చేశారు. అంతెం సుబ్బరాయుడు (కాటయ్య) అరటితోట సాగు చేస్తున్నాడు. తన పొలంలో ఉన్న కేబుల్ వైర్ 14 మీటర్లను దొంగలు కట్‌చేసి వెళ్లిపోయారు. పక్కపొలంలోని ములపాక ఈశ్వర్‌రెడ్డి మూడు ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నాడు. మోటారు దగ్గర ఉన్న 25 మీటర్ల కేబుల్ వైర్‌ను కట్‌చేసి దొంగలు ఎత్తుకెళ్లారు. కేబుల్ వైర్ల చోరీ మండలంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. చోరీలపై పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు.
హత్య కేసులో
నిందితుడి అరెస్టు
పెండ్లిమర్రి : మండలంలోని గంగనపల్లె హరిజనవాడలో ఈనెల 2వ తేదీ రాత్రి భార్యను హత్య చేసి పరారైన నిందితుడిని అరెస్టు చేసినట్లు కడప రూరల్ సీఐ చల్లని దొర తెలిపారు. శుక్రవారం పెండ్లిమర్రిలో ఆయన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్య లూర్థు మేరీని భర్త సుబ్బరాయుడు విచక్షణ రహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందింది. మృతురాలి కుమారై నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయగా భర్త సుబ్బరాయుడు హత్య చేసినట్లు తెలిసిందన్నారు. పరారీలో ఉన్న నిందితుడు రెవెన్యూ అధికారుల ద్వారా పోలీసు స్టేషన్‌కు హాజరై నేరాన్ని అంగీకరించారన్నారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం జూడిషియల్ మేజిస్టేట్ వద్దకు పంపామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment