కడప సెవెన్‌రోడ్స్ : కేసీ కెనాల్‌కు ఏప్రిల్ 15 వరకు సాగునీరు అందించి పంటలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకుడు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి శుక్రవారం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి విన్నవించారు. కెనాల్‌కు నీరు రాకపోవడంతో మిరప, మినుము, వరి, పెసర, పసుపు పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయంలో 846.7 అడుగుల నీరు మాత్రమే ఉందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా 841 అడుగులు చేరే వరకు నీరు డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 15 రోజుల క్రితమే నీరు నిలిపి వేశారన్నారు. ముచ్చుమర్రి లిఫ్ట్ వద్ద నుంచి కేసీ కెనాల్‌కు 805 అడుగుల వరకు నీటిని తీసుకునే వీలుందన్నారు. ఈ పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ద్వారా నీటిని వదిలి కేసీ కెనాల్ ఆయకట్టు పైర్లను కాపాడాలన్నారు. కనీసం మార్చి చివరి వరకై నానీరు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న వేసవిలో బోరు బావుల్లో భూగర్బ జలాలు పెరిగేలా చర్యలు చేపట్టి తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రాజోలి జలాశయాన్ని 2.95 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తే కేసీ కెనాల్ కింద రెండు పైర్లు సాగు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment