● ఆటాడించి...అగ్రస్థానంలో నిలిచి
విద్యార్థులకు ఆటపాటలు అక్కర్లేదని, అవి అన్నం పెట్టవని, పైగా చదువు పాడవుతుందని తల్లిదండ్రులు తేలిగ్గా చూస్తున్నారు. ఇలాంటి దశలో క్రీడారంగంలో తనదైన పట్టు సాధించి ఆణిముత్యాల్లాంటి విద్యార్థులను గుర్తించి వారి ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళుతోంది ఆమె. తాను పనిచేస్తున్న పాఠశాల గౌరవాన్ని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపిన డ్యాషింగ్ లేడీ, కడప నగర పాలక సంస్థ (మెయిన్) స్కూలు ఫిజికల్ డైరెక్టర్ ఎల్.వెంకట లక్ష్మిదేవి. 2012లో ఆమె బదిలీపై మున్సిపల్ మెయిన్‌హైస్కూలుకు వచ్చారు. మైదానంలో దిగారు. అంతవరకు స్తబ్దుగా ఉన్న క్రీడాపరికరాలకు చలనం వచ్చింది. ఫలితంగా ఆ స్కూలు రాష్ట్ర స్థాయిలో రెండుసార్లు ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత ఏకంగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి కడప పతాకాన్ని రెపరెపలాడించింది. దీంతో మన్సిపల్ హైస్కూలు మెయిన్ పాఠశాలను ప్రజలు క్రీడా పాఠశాలగా వ్యవహరిస్తున్నారు. మా వాడికి ఆటలు వద్దు అంటూ వెనక్కి తీసుకెళ్లిన బాలలను పదో తరగతిలో టాపర్లుగా నిలిపి వాళ్ల అభిప్రాయం తప్పని నిరూపించారు. తన శ్రమతో పలువురు విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో క్రీడా బహుమతులు సాధించేలా చేసింది. ఫిజికల్ డైరెక్టర్‌గా ఎల్.వెంకటలక్ష్మి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇప్పుడామె వైఎస్సార్ జిల్లాలో క్రీడా శిక్షణకు ఐకాన్‌గా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment