No Headline
కడపకు చెందిన శ్వేత మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్నప్పుడు ఆసక్తిగల వారు ఫొటోగ్రఫీ సర్టిఫికెట్ కోర్సులో చేరవచ్చని ఆ విభాగం ట్రైనర్ ప్రొఫెసర్ ఎం.గురుమోహన్‌రెడ్డి ప్రకటించారు. శ్వేత ఆ కోర్సులో చేరింది. మిగతా వారి కంటే శ్రద్ధగా ఫొటోగ్రఫీలో టెక్నిక్స్ నేర్చుకుంది. చక్కటి యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తుండడంతో ఆమెకు పలు ప్రాజెక్టుల్లో ఫొటోలు తీసే అవకాశం లభించింది. ప్రస్తుతం శ్వేత ఔట్‌డోర్ ఫొటోగ్రఫీలో కూడా ప్రతిభ చాటుతోంది. ఇటీవల టెంపుల్ ఫొటోగ్రఫీ విభాగంలో ఆమె తీసిన పుష్పగిరి దేవాలయాల ఫొటోలను చూసిన నాటి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అభినందించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
‘క్లిక్’ అయ్యింది
Comments
Please login to add a commentAdd a comment