No Headline
మదనపల్లెకు చెందిన ఆయిషా ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించింది. లక్షల్లో జీతం అయినా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సా హంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి గ్రూప్–1కు సన్నద్ధమయ్యారు. తొలి ప్రయత్నం విఫలమైనా నిరాశ చెందలేదు. మళ్లీ పట్టుదలతో ప్రయత్నించి గ్రూప్–1 విజేతగా నిలిచింది. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమె అనకాపల్లి ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్నారు. మదనపల్లెకు చెందిన అహ్మద్‌బాషా చిరువ్యాపారి. తల్లి సాధారణ గృహిణి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చినా తాను సివిల్స్ రాయాలని ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ప్రోత్సాహంతో పోటీ పరీక్షలు రాసి విజేతగా నిలిచారు.
ఓటమే విజయానికి నాంది
Comments
Please login to add a commentAdd a comment