● ’అభ్యాగుల పాలిట ‘స్వాతి’కిరణం
మదనపల్లె సిటీ: తనకు మాత్రమే ఎందుకు కష్టం వచ్చింది? అని ఆలోచించే బదులు నాలా మరెంత మందికి ఈ కష్టం వచ్చిందో.. వాళ్ల పరిస్థితి ఏమిటి అని ఆలోచించే మనస్తతత్వం అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి రెండో కోవకు చెందుతుంది డాక్టర్ శంఖారపు స్వాతి. ఉద్యోగ,ఉపాధి కోసం తిరగని చోటంటూ లేదు. దీంతో తీవ్ర నిరాశ నిస్పహులకు లోనైనా నేడు ఆమె వేలాది మందికి నైపుణ్యాలను అందించి వారికి దారి చూపిస్తోంది. మదనపల్లె పట్టణానికి చెందిన డాక్టర్ స్వాతి తెలుగుభాషలో పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత పెద్దలు నిశ్చయించిన వారితో పెళ్లి చేసుకుని బెంగళూరులో అడుగుపెట్టింది. అంతా బాగానే ఉందనుకునే సమయానికి భర్తకు వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు వచ్చాయి. దీంతో మరోదారి లేక డిగ్రీ పట్టా చేతపట్టి ఉద్యోగ వేటలో పడిన ఆమెకు ఎక్కడకెళ్లినా నిరాశే ఎదురయ్యేది. దీంతో మదనపల్లె పట్టణానికి చేరుకున్నారు. డబ్బు చెల్లించి కోర్సులు నేర్చుకునే స్థోమత లేక టైలరింగ్,కుట్లు, అల్లికలు, శారీరోలింగ్, ఫ్రాబిక్ పెయింటింగ్,ఎంబ్రాడయిరీ వంటి వాటిని ఆన్‌లైన్ ద్వారా సొంతంగా నేర్చుకుంటూ ప్రతిభను పెంచుకున్నారు.ఆకట్టుకునే డిజైన్లతో వస్త్రాలను కుట్టించేది. వచ్చిన డబ్బుతో బోటిక్, టైలరింగ్ షాపులను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఒంటరి మహిళలు, వితంతువులు,సమాజంలో పడే కష్టాలను గమనించింది. అలాంటి వారికి చేయూత ఇవ్వాలన్న లక్ష్యంతో ధాత్రి ఫౌండేషన్ ప్రారంభించింది. తొమ్మిది మందితో ప్రారంభమై నేడు వెయ్యి మందికిపైగా మహిళలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. రోగులకు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు చేయూతనిచ్చి వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కల్పించి సూక్ష్మ రుణాల ద్వారా ఉపాధి కల్పించి వారి వికాసానికి తోడ్పతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment