● మూగ జీవాలకు సేవ చేయాలనే లక్ష్యంతో..
కడప అగ్రికల్చర్: మాది వ్యవసాయ కుటుంబం. మా తల్లితండ్రులు కూడా వ్యవసాయంతోపాటు పాడి పశువులను పెంచేవారు. పాడి పశువులపై వారికి ఉన్న ప్రేమ చూసినేను కూడా బ్యాచురల్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేశా.పశుసంవర్ధకశాఖలో ఉద్యోగాన్ని సంపాదించి వేల మూగజీవాలకు సేవలందిస్తున్నానని జిల్లా పశుసంవర్థశాఖ అధికారి డాక్టర్ చెముడూరి శారదమ్మ చెబుతున్నారు. వివరాలు ఆమె మాటల్లో..మాది కలపాడు మండలం కలసపాడు గ్రామం. నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎగువ రామాపురంలో, 6,7,8 తరగతులను కలసపాడులో, 9, 10 తరగతులు పోరుమామిళ్లలో చదివాను. ఇంటర్ను కడపలోని బాలికల జూనియర్ కళాశాలలో, డిగ్రీ తిరుపతిలో పూర్తి చేశా.తర్వాత బ్యాచులర్ ఆఫ్ వెటర్నీరీ సైన్స్ తిరుపతిలో పూర్తి చేశాను.
● 1993లో చాపాడు మండలం వెదురూరులో తొలిసారిగా పశువైద్యాధికారిగా ఉద్యోగంలో చేరా. మూగ జీవాలకు వైద్యసేవలందిస్తూ..రైతు సంక్షేమం, అభివృద్ధి ద్యేయంగా పనిచేశాను. 2005 అసిస్టెంట్ డైరెక్టర్గా పదోన్నతి పొంది జమ్మలమడుగు ప్రాంతంలో పలు మండలాల్లో పనిచేశా. 2014లో డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి పొంది కడపకు వచ్చా. ఇక్కడే పనిచేస్తూ 2021లో జిల్లా పశువైద్యాధికారిగా పదోన్నతి పొంది సేవలందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వైద్యులకు సూచనలు, సలహాలను అందిస్తూ రైతు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తల్లితండ్రుల ఆశయాన్ని నేరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని చెబుతున్నారు డాక్టర్ శారదమ్మ.
Comments
Please login to add a commentAdd a comment