
అవినీతికి పాల్పడి ఉంటే ఈ రోజు అప్పులుండేవి కాదు
ప్రొద్దుటూరు : ప్రజా సంక్షేమం కోసం దూరదృష్టితో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతిని ప్రోత్సహించకుండా చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. విచ్చలవిడిగా అవినీతిని అప్పట్లో ప్రోత్సహించి ఉంటే ఈ రోజు తనకు అప్పులు ఉండేవి కాదన్నారు. ఏదో విధంగా అవినీతిపరుడనే ముద్ర వేసి తనను జైలుకు పంపడమే లక్ష్యంగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. దొరసానిపల్లెలోని తన స్వగృహంలో రాచమల్లు శివప్రసాదరెడ్డి శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ఎమ్మెల్యే వరద తనపై వ్యక్తిగత కక్షతోనే విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి గురించో, పాల కేంద్రం గురించో, ఆగిన డ్రైనేజీ కాలువల నిర్మాణాల గురించో అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడి ఉంటే అందరు సంతోషించేవారన్నారు. అలా కాకుండా కేవలం తనను అవినీతి పరుడని చెప్పేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకున్నారన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం 200 మంది రైతుల నుంచి భూమిని సేకరించినట్లు తెలిపారు. ఆ పరిహారం మొత్తం రైతుల బ్యాంకుల ఖాతాల్లో అధికారులు జమ చేశారన్నారు.
ఒక్క రైతునైనా చూపించండి
ఎమ్మెల్యే వరద ఉద్దేశ్య పూర్వంగా తాను ఎకర భూమిని రూ.20 లక్షలకు కొని రూ.40 లక్షలకు అమ్మినట్లు ఆరోపణలు చేశారని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి భూములు అమ్మక ముందు భూముల రిజిస్ట్రేషన్ జరిగిందేమో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చెక్ చేసుకోవాలని సూచించారు. సోములవారిపల్లెలో మీ వర్గీయుడైన మాజీ సర్పంచ్ సాంబశివుడు, రామేశ్వరంలో బిజినేపల్లి సుధాకర్, మీనాపురంలో లక్ష్మిరెడ్డి భూములను ప్రభుత్వం సేకరించిందన్నారు. వారి నుంచి తాను భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అమ్మినట్లు నిరూపించాలని కోరారు. తన బావమరిది మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డితోపాటు తాను కూడా పలు మార్లు ఈ విషయంపై ప్రెస్‌మీట్లు పెట్టామన్నారు. తాము వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఎన్నికల ముందు ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చాక ఎందుకు నిరూపించలేకపోతున్నారన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ జేష్టాది శారద, మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు నూకా నాగేంద్రారెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సత్యం, లావణ్య, జయంతి, డీలర్ అంజి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మార్తల ఓబుళరెడ్డి, వెంకటేష్, రామ్మోహన్‌రెడ్డి, ఖాజాపీర్ పాల్గొన్నారు.
ఏదో రకంగా జైలుకు పంపాలనే ఎమ్మెల్యే వరద అసెంబ్లీలో ఆరోపణలు
రూ.162 కోట్లకు భూములు కొంటే రూ.800 కోట్లు అవినీతి సాధ్యమా?
విజిలెన్స్ నివేదిక ఇచ్చినా వరద రెడ్ బుక్ రాజ్యాంగం కావాలంటున్నారు
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment