
మహిళలు ఆదిపరాశక్తి స్వరూపం
కడప కార్పొరేషన్ : మహిళలు ఆదిపరాశక్తి స్వరూపమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి సతీమణి డా. పోచిమరెడ్డి అరుణమ్మ అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, కడప నియోజకవర్గ అధ్యక్షురాలు బండి దీప్తి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మొదట వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళలకు తినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజం మహిళలకు ఉన్నత స్థానం కల్పించిందన్నారు. ఆ ఉన్నతిని కాపాడుకునేందుకు పోరాటం చేయాలన్నారు. భవిష్యత్‌లో మహిళలకు అన్ని రంగాల్లో మంచి అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. అంతకుముందు మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలందరికీ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళా నేతలంతా అరుణమ్మను, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలు పత్తిరాజేశ్వరి, రత్నకుమారి,ఉమామహేశ్వరి, క్రిష్ణవేణి, తులశమ్మ, హైమవతి, మల్లీశ్వరి, నారాయణమ్మ, జ్యోతి, పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సతీమణి అరుణమ్మ
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో
ఘనంగా మహిళా దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment