
చౌకబారు రాజకీయాలతో కాలయాపన
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎస్.వి.సతీష్ కుమార్ రెడ్డి
వేంపల్లె : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చౌకబారు రాజకీయాలతో కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శనివారం వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని కూడా చిల్లర రాజకీయం కోసం 45 నిమిషాలపాటు కేబినెట్ సమావేశంలో మాట్లాడావంటే నీ స్థాయి ఎటువంటిదో ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ఒక గొప్ప మిషనరీగా ప్రాజెక్టు చేయబడ్డావని దేశమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజులు ఉన్నాయని చెప్పి అందరూ చెప్పుకునేవాళ్లు.. అయితే ఎక్కడికి పోయింది నీ పరిపాలన దక్షత అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఎటువంటి అవినీతి జరగకుండా సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు డైరెక్ట్‌గా అందజేసినటువంటి గొప్ప నాయకుడు అన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా రూ.2.80వేల కోట్లు ప్రజల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. రాష్ట్రానికి 750 మెడికల్ కాలేజీ సీట్లు తీసుకొని వస్తే వాటిని వద్దని వెనక్కి రాసి ఇచ్చిన దౌర్భాగ్య ప్రభుత్వం కాదా మీది అన్నారు. అలాగే మెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి వ్యాపారం చేయడం ఇంత కన్నా దౌర్భాగ్యం ఉంటుందా అని విమర్శించారు. సామాన్య విద్యార్థులకు ఉన్నత విద్యనభ్యసించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలను మంజూరు చేస్తే వాటికి నిధులు ఇచ్చుకోలేక పేద విద్యార్థులపైనే ఆర్థిక భారం పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రతి కార్యక్రమంలోనూ కమీషన్లు వచ్చేది వాస్తవం కాదా అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల నుంచి సామాన్య ప్రజలు ఏమి కొనుగోలు చేయాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వ్యాపారవృద్ధి పరంగా 30 శాతం వ్యాపారాలు కూడా జరగలేని పరిస్థితి ఉందన్నారు. ఏదో సంపద సృష్టితారని గొప్పలు చెప్పుకున్న సీఎం చంద్రబాబు అన్ని రంగాల్లో ఘోర వైఫల్యం చెందారని తెలిపారు. మీ పత్రికలు, చానళ్లు దుష్ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. వివేకా హత్య కేసులో జగన్ సతీమణి భారతి, నారాయణ యాదవ్‌తోపాటు చనిపోయిన ఇసి గంగిరెడ్డి, అభిషేక్ రెడ్డి పేర్లను చేర్చిన విషసంస్కృతి చంద్రబాబుది అని అన్నారు. షర్మిలమ్మ కూడా చంద్రబాబు ట్రాప్‌లో పడి జగన్‌పై విమర్శలు చేయడం శోచనీయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment