వైభవంగా మహా సంప్రోక్షణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం మహా సంప్రోక్షణ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు పొల్గొని పంచసూక్త పవమాన హోమాలు నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు మహాపూర్ణాహుతి, 10.15 నుంచి 11.30 గంటల వరకు వృషభలగ్నంలో మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం, స్వర్ణపుష్పార్చన జరిగపారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో అర్చకులు, డిప్యూటీ ఈఓలు నటేష్ బాబు, గోవిందరాజన్, సెల్వం, ప్రశాంతి, ఎస్‌ఈలు వెంకటేశ్వర్లు, మనోహర్, వీజీఓ సదాలక్ష్మీ, ప్రెస్ అండ్ సేల్స్ వింగ్ ప్రత్యేక అధికారి రామరాజు పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ
కడప సెవెన్‌రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’లో అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు.
డయల్ యువర్ కలెక్టర్: ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి 10.00 గంటల వరకు జరుగుతుందని డీఆర్వో తెలియజేశారు. ప్రజలు 08562– 244437 ల్యాండ్‌లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు.
ఏకగ్రీవ ఎన్నిక
కడప ఎడ్యుకేషన్: ఏపీ పీఈటీ అండ్ ఎస్‌పీఈ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడపకు చెందిన మిద్దె ప్రవీణ్ కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప మండల పరిధిలోని నరసరాంపల్లె ఈయన స్వస్థలం. ఆదివారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ప్రవీణ్ కిరణ్‌ను ఎన్నుకున్నారు. ఈయన కడప నగరం చెమ్ముమియాపేటలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాతీయ లోక్ అదాలత్‌లో 7546 కేసులు పరిష్కారం
కడప అర్బన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కడప వారి ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. వైఎస్‌ఆర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 బెంచీలు ఏర్పాటు చేశారు. ఇందులో క్రిమినల్ కేసులు 7231, 197 సివిల్ కేసులు, 118 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్బంగా రూ.26,13,95,784 కక్షిదారులకు చెల్లించారు. కడపలో 2109 కేసులు, పొద్దుటూరు 2082, రాజంపేట 933, రాయ చోటి 240, బద్వేల్ 283, జమ్మలమడుగు 1005, సిద్ధవటం 137, రైల్వేకోడూరు 157, పులివెందుల 365, నందలూరు 80, లక్కిరెడ్డిపల్లి 26, కమలాపురంలో 129 కేసులు జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించారు. ఈ కేసుల పరిష్కారానికి తోడ్పడిన వివిశాఖల అధికారులకు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్మన్ జి.శ్రీదేవి , సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్ బాబా ఫక్రుద్దీన్‌లు కృతజ్ఞతలు తెలియజేశారు.
అన్నదాన సదనానికి రూ.లక్ష
వేముల: బ్రహ్మంగారిమఠంలో నిర్మిస్తున్న పట్రానాయుళ్ల అన్నదాన సదనానికి వేముల మండలం ఎంపీపీ చల్లా గంగాదేవి, చల్లా వెంకటనారాయణలు ఆదివారం లక్ష రూపాయలు విరాళంగా అందించారు. చల్లా వెంకటనారాయణ తండ్రి, మాజీ సర్పంచ్ దివంగత చల్లా పెద్ద వెంకటయ్య, తల్లి రామసుబ్బమ్మ జ్ఞాపకార్థం వారు ఈ విరాళాన్ని అందజేశారు. పట్ర సంక్షేమ సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా సునీల్ కుమార్, పట్రా సంక్షేమ సంఘ గౌరవాధ్యక్షుడు ఆంజనేయులు,అధ్యక్షుడుహనుమంతునాయు డు,సత్యసాయి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు,ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప పాల్గొన్నారు.
వైభవంగా మహా సంప్రోక్షణ
వైభవంగా మహా సంప్రోక్షణ
Comments
Please login to add a commentAdd a comment