పొలంలో దారి విషయమై ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

పొలంలో దారి విషయమై ఘర్షణ

Published Tue, Mar 11 2025 1:48 AM | Last Updated on Tue, Mar 11 2025 1:48 AM

పొలంల

పొలంలో దారి విషయమై ఘర్షణ

పెండ్లిమర్రి : మండలంలోని నందిమండలం గ్రామానికి చెందిన మనోహర్‌రెడ్డి, గంగిరెడ్డి, జనార్దన్‌రెడ్డిలు సోమవారం పొలం వద్ద దారి విషయమై గొడవ పడ్డారు. పోలీసుల కథనం మేరకు...మనోహర్‌రెడ్డికి చెందిన అరటి చెట్లు, నిమ్మ, వేపచెట్లను అన్నదమ్ములైన గంగిరెడ్డి, జనార్దన్‌రెడ్డిలు జేసీబీతో పీకివేయించారు. మనోహర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు అన్నదమ్ములపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని తలపెట్టిన ఆందోళన సందర్భంగా జిల్లాలో అంగన్‌వాడీ వర్కర్లను అరెస్టు చేయడం, నిర్బంధించడం సరైంది కాదని సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు బి.మనోహర్‌, నాగసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కడప ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు రూ.26వేలకు జీతం పెంచితే ఇలాంటి ఆందోళనలు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడం మానుకొని అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణాచారి, జిల్లా నాయకుడు ఎ.రామ్మోహన్‌, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరిరెడ్డి, సీఐటీయూ నాయకులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

రాయచోటి ఘటనపై

నిరసన ప్రదర్శన

కడప సెవెన్‌రోడ్స్‌ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయ పారువేట ఉత్సవం సందర్భంగా ఈనెల 4వ తేదీ చోటుచేసుకున్న ఘటనలకు నిరసనగా విశ్వహిందూ పరిషత్‌ నాయకులు వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడప నగరంలో ప్రదర్శన నిర్వహించారు. మృత్యుంజయకుంట శివాలయం నుంచి ఆర్టీసీ బస్టాండు మీదుగా కలెక్టరేట్‌ వరకు ఈ ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నందారపు చెన్నకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రశాంతంగా పారువేట ఉత్సవాన్ని నిర్వహిస్తున్నవారిపై మరో వర్గంవారు దాడి చేశారని ఆరోపించారు. వారిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జేసీ అదితిసింగ్‌కు వినతిపత్రం సమర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పొలంలో దారి విషయమై ఘర్షణ   1
1/1

పొలంలో దారి విషయమై ఘర్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement