సాగు భళా..దిగుబడి డీలా! | - | Sakshi
Sakshi News home page

సాగు భళా..దిగుబడి డీలా!

Published Wed, Mar 12 2025 8:22 AM | Last Updated on Wed, Mar 12 2025 8:17 AM

సాగు

సాగు భళా..దిగుబడి డీలా!

రైతు మరోసారి నష్టపోయాడు. ‘కాలం’ కలిసిరాక అప్పుల గాళానికి చిక్కి అల్లాడిపోయాడు. ఇంటిల్లిపాది కలిసికట్టుగా పని చేసినా పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొంది. ఇక ప్రభుత్వం నుంచి ‘సుఖీభవ’ లేక... రైతన్నకు దుఃఖమే మిగిలింది. చివరిగా గిట్టుబాబు ధర కోసం శ్రమించాల్సి వస్తోంది.

జిల్లాలో రబీలో పంట సాగు

వివరాలు హెక్టార్లలో...

పంట సాగైన విస్తీర్ణం

శనగ 77653

మినుము 21712

నువ్వులు 4129

జొన్న 6405

వేరుశనగ 2826

వరి 6162

పెసర 1529

ఉలవలు 1586

సజ్జలు 1747

మొక్కజొన్న 2382

కుసుమ 148

కంది 224

కొర్ర 156

కడప అగ్రికల్చర్‌: ఈ ఏడాది రబీ సీజన్‌లో పంటలు ఆశాజనకంగా సాగైనా.. దిగుబడి రాక రైతులు దిగాలు పడ్డారు. రబీ ప్రారంభంలోనే వర్షాలు కురవడంతో రైతులు ఉత్సాహంగా పంటలను సాగు చేశారు. దిగుబడి చేతి కొచ్చే సమయానికి అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలకు దిగుబడి భారీగా తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీనికితోడు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా కరువైంది. పంటలసాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ఇస్తామన్న రూ. 20 వేల రైతు భరోసాను కూడా ఇవ్వకుండా మెండి చేయి చూపింది. దీనికితోడు ఇటు పంటలసాగులో దిగుబడి రాక... అటు ప్రభు త్వం ఆదుకోక అన్నదాతలు అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. అరకొరగా వచ్చిన దిగుబడులకై నా గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొను గోలు చేసి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

పెరిగిన సాగు..

ఈ ఏడాది జిల్లాలో వర్షాలు బాగా కురవడంతో రబీ పంటసాగు పెరిగింది. జిల్లావ్యాప్తంగా సాధారణసాగు 1,42,988 హెక్టార్లుకాగా మార్చి 1వ తేదీ రబీ సీజన్‌ ముగిసే నాటికి 1,27,465 హెక్టార్లలో విఽవిధ పంటలు సాగయ్యాయి. ఇందులో ఉలవ సాధారణసాగు 428 హెక్టార్లుకాగా 1586 హెక్టార్లలో సాగై 370.57 శాతం మేర సాగు కాగా పొగాకు సాధారణసాగు 59 హెక్టార్లుకాగా 182 హెక్టార్లలోసాగై 308.47 శాతం మేర నమోదైంది. ఇక మొక్కజొన్న 165.43 శాతం, మినుము 147.39 శాతం, కంది 110.77 శాతం, శనగపంట 94.40 శాతం మేర సాగయ్యాయి. ఆరుతడి పంటలు ఆశాజనకంగా సాగైనా దిగుబడి చేతి కొచ్చే సమయానికి దిగుబడులు తగ్గి రైతన్నలకు నష్టాలే మిగిలాయి.

అంతంత మాత్రంగానే సేవలు.....

గత ప్రభుత్వం రైతులకు సేవలు అందించడానికి భరోసా కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లావ్యాప్తంగా 420 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థశాఖ ఉద్యోగాలను నియమించి సేవలను అందుబాటులోకి తెచ్చారు. విత్తనం మొదలుకుని పంట అమ్ముకునే వరకు ఎరువులు, క్రిమి సంహారక మందులు, విత్తన పరీక్షలు, ఈ క్రాపు బుకింగ్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పెట్టుబడి సాయం అందించేవారు. వీటితోపాటు రైతులకు భూసార పరీక్షలను చేయడంతోపాటు రైతులకు నకిలీ ఎరువులు, పురుగు మందులను అందించేందుకు వీలు లేకుండా అగ్రిల్యాబ్‌లను ఏర్పాటు చేసి సేవలను అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాలను (ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలు) నిర్లక్ష్యం చేస్తోంది. రైతులకు కావాల్సిన సేలలను సరిగా అందించడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

ముగిసిన రబీ సీజన్‌

జిల్లావ్యాప్తంగా 1,27,465 హెక్టార్లలో సాగైన పంటలు

వందశాతం మించి సాగైనమొక్కజొన్న, మినుము, కంది పంటలు

జిల్లాలో 89.14 శాతంమేరసాగైన పంటలు

రైతులను ఆదుకోవాలి

రబీలో సాగు చేసిన ఆరుతడి పంటలు ప్రకృతి వైపరీత్యాలతో బాగా దెబ్బతిని దిగుబడి తగ్గింది. దీంతో చాలా మంది రైతులకు ఖర్చులు కూడా రాలేదు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి. – దస్తగిరిరెడ్డి,

రైతు సంఘం జిల్లా కార్యదర్శి.

నష్టమే..

నా పేరు సానేపల్లి సాంబశివారెడ్డి. మాది కమ లాపురం మండలం కంచెన్నగారిపల్లె. నేను 3 ఎకరాల 20 సెంట్లలో శనగపంటను సాగు చేశాను. దిగుబడి చూస్తే ఎకరాకు రూ. 26 వేలు చొప్పున వచ్చింది. ఖర్చేమో 26 వేలు దాటింది. – సాంబశివారెడ్డి,

కంచెన్నగారిపల్లె. కమలాపురం మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
సాగు భళా..దిగుబడి డీలా! 1
1/4

సాగు భళా..దిగుబడి డీలా!

సాగు భళా..దిగుబడి డీలా! 2
2/4

సాగు భళా..దిగుబడి డీలా!

సాగు భళా..దిగుబడి డీలా! 3
3/4

సాగు భళా..దిగుబడి డీలా!

సాగు భళా..దిగుబడి డీలా! 4
4/4

సాగు భళా..దిగుబడి డీలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement