● మంజూరైనా.. వద్దన్నారు
సాక్షి ప్రతినిధి, కడప: విద్యార్థుల చదువులపై బాధ్యత లేదు. యువత ఉపాధి, భవిష్యత్‌పై అస్సలు చొరవ లేదు. కార్మికులు, కర్షకులపై చిత్తశుద్ధే లేదు. మహిళాభివృద్ధి ఉన్నతి కోసం కృషి చేసిన దాఖలాల్లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ నిర్లక్ష్యపు తీరిది. ఇక జిల్లాలోని మెడికల్ కళాశాల కళాశాల నిర్వహణపై విముఖత చూపింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసిన ఎంబీబీఎస్ సీట్లు వద్దని తెగేసి చెప్పడం బాబు వివక్ష పాలనకు దర్పణం పట్టింది.ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత పోరుబాట పట్టారు. బుధవారం జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో ‘యువత పోరు’ కార్యక్రమం చేపట్టేందుకు సంసిద్ధులయ్యారు. జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ చేపట్టనున్నారు.
● రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థపై చిన్నచూపు ప్రదర్శిస్తోంది. గత ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ గ్రామాల్లో సైతం కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ చదువులుండాలనే సంకల్పాన్ని ఆచరణలో చూపెట్టారు. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. విద్యార్థులను ప్రోత్సహించారు. ఉన్నత చదువులపై చిత్తశుద్ధి ప్రదర్శించారు. ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ క్లియర్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు సర్కార్‌లో ఇప్పటి వరకూ ఫీజు రీయింబర్స్‌మెంటు పూర్తి స్థాయిలో చెల్లింపుల్లేవు. జిల్లాలో 44,876 మంది విద్యార్థులకు దాదాపు రూ.155కోట్లు పైబడి రావాల్సి ఉండగా కేవలం రూ.34.52కోట్లు చెల్లించారు. ప్రతి మూడు నెలలకు ఓమారు విద్యా దీవెన నిధులు ఇవ్వాల్సి ఉండగా, ఒక్కమారు మాత్రమే చెల్లించారు. వసతి దీవెన నిధులు అస్సలు మంజూరు చేయలేదు. పెండింగ్ బకాయిలు చెల్లింపులు లేవు, దీంతోసామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు వేదనకు గురవుతున్నారు.
ఉపాధి లేదు... నిరుద్యోగ భృతి అసలే లేదు...
వైఎస్సార్‌సీపీ సర్కార్‌లో కొప్పర్తి పారిశ్రామికవాడలో ఆల్‌డిక్సన్, సెంచురీఫ్లై బోర్డ్స్ సంస్థల ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష ఉద్యోగ ఉపాధి లభించింది. స్థానికులకే అవకాశం కల్పించాలన్న నిబంధనలతో బద్వేల్ పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 2వేలు మందికి ఉద్యోగాలు లభించాయి. కొప్పర్తి పరిసర ప్రాంతంలో మరో 3వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. కూటమి ప్రభుత్వంలో జిల్లాకు కొత్తగా వచ్చిన పరిశ్రమలు లేవు. వస్తాయన్న నమ్మకాలు సన్నగిల్లాయి. ప్రత్యక్ష ఉపాధి మార్గాలకు అవకాశం కన్పించలేదు. ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు అందిస్తామని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 2.80లక్షల మంది యువనేస్తం పథకానికి అర్హులుగా ఉన్నారు. వీరికి నెలకు రూ.84కోట్లు చెల్లించాల్సి ఉంది.
యువత, విద్యార్థులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కూటమి సర్కార్
కొత్త పరిశ్రమల్లేవు..నూతన ఉద్యోగాల్లేవు..భృతి ఊసే లేదు
ప్రభుత్వంలో తాండవిస్తున్న నిర్లక్ష్యం..విలవిలలాడుతోన్న సామాన్యులు
ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా లేక ఆవేదనలో లక్షల మంది విద్యార్థులు
నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే తపనను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రదర్శించారు. పులివెందులలో రూ.530కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో 627 పడకలు వసతి గల ఆస్పత్రి నెలకొల్పారు. ఏడాదికి 150 మెడికల్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లలో విద్యను అభ్యసించేలా వసతులు సమకూర్చారు. 50సీట్లు కేటాయిస్తూ ఎన్‌ఎంసీ ఆగస్టు 5న ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన ఎంబీబీఎస్ సీట్లు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం గమనార్హం. పైగా ఆయా మెడికల్ కళాశాలను ప్రవేటు పరం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండం వింతగా పలువురు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment