నేటి ‘యువత పోరు’ను విజయవంతం చేయాలి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బుధవారం నిర్వహించనున్న ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక తన కార్యాలయంలో మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిలతో కలిసి వైఎస్సార్‌సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇటీవల పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా ఈ హామీలపై స్పష్టత ఇవ్వకపోవడం దారుణమన్నారు. విద్యార్థులకు రూ.3900కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు ఇంకా విడుదల చేయలేదని, దీనివల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను ఈ ప్రభుత్వం మోసం చేసిందని, బుధవారం నిర్వహించే ‘యువత పోరు’లో వారంతా భాగస్వాములై ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చా రు. ఉదయం 10 గంటలకు వైఎస్సార్‌సీపీ జిల్లా కా ర్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ర్యాలీ ప్రారంభమవుతుందని, మహావీర్ సర్కిల్ మీదుగా ఈ ర్యాలీ కలెక్టరేట్‌కు చేరుకుంటుందని, ఆ తర్వాత కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment