ఈనెల 13న జ్యోతి క్షేత్రానికి ఎంపీ అవినాష్‌రెడ్డి రాక
పోరుమామిళ్ల : ఈనెల 13న గురువారం ఉదయం 8–30 గంటలకు కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి జ్యోతి క్షేత్రం కాశినాయన క్షేత్రాన్ని సందర్శిస్తారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కె. రమణారెడ్డి తెలిపారు. మూడు దశాబ్ధాలుగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి, నిత్యాన్నదానం, కాశినాయన సమాధిని సందర్శించుకుంటున్న వేలాదిమంది భక్తుల విశ్వాసం విస్మరించి, అక్కడ అధికారులు కట్టడాలు కూలగొట్టడంపై స్వయంగా తెలుసుకొనేందుకు ఎంపీ వస్తున్నారన్నారు. ఆయనతో పాటు బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జిల్లా నాయకులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో
విశ్రాంత ఉపాధ్యాయుడి మృతి
జమ్మలమడుగు రూరల్ : రోడ్డు పక్కన నిలబడి నీళ్లు తాగుతుండగా వేగంగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొని ప్రొద్దుటూరుకు చెందిన నగళ్లపాటి సుబ్బరాయుడు (63) అనే విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి చెందాడు. జమ్మలమడుగు మండలంలో మంగళవారం రాత్రి 9.30 గంటలకు జరిగిన ప్రమాద సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన నగళ్లపాటి సుబ్బరాయుడు సొంత పనుల నిమిత్తం స్వగ్రామం అయిన మైలవరం మండలం వేపరాల గ్రామానికి భార్య కృష్ణవేణితో కలిసి వచ్చాడు. పనులు ముగింకునిని స్కూటీలో తిరిగి ప్రొద్దుటూరు వెళుతుండగా మార్గమాధ్యంలోని ధర్మాపురం గ్రామం వద్దకు వెళ్లగానే దాహం వేసింది. దీంతో స్కూటీని ఆపి నీళ్లు తాగుతుండగా ప్రొద్దుటూరు వైపు వెళుతున్న బొలెరో క్యాంపర్ వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో నగళ్లపాటి సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతి చెందగా భార్య కృష్ణవేణికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 వాహనంలో బాధితురాలిని ప్రొద్దుటూరుకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఈనెల 13న జ్యోతి క్షేత్రానికి ఎంపీ అవినాష్‌రెడ్డి రాక
ఈనెల 13న జ్యోతి క్షేత్రానికి ఎంపీ అవినాష్‌రెడ్డి రాక
Comments
Please login to add a commentAdd a comment