అమరజీవి త్యాగం ఆదర్శనీయం
కడప సెవెన్‌రోడ్స్: ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సంస్మరణ సభ జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జాతికోసం ప్రాణాలర్పించిన మహనీయులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. విధినిర్వహణలో ప్రతి ఉద్యోగికి ఆయన అత్యున్నత విలువలు స్ఫూర్తిదాయకం అన్నారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి డీఆర్వోతో పాటు పలువురు పూలమాలవేసి నివాళులర్పించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి, కలెక్టరేట్ అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రాణత్యాగం చేసిన మహనీయుడు
కడప అర్బన్: దేశంలోని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు మనందరికి గర్వకారణమని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ కొనియాడారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీఅశోక్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. అదనపు ఎస్పీ కె ప్రకాష్ బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య, ఆర్‌ఐలు ఆనంద్, వీరేష్, టైటాస్, శివరాముడు, ఆర్.ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
డీఆర్వో విశ్వేశ్వరనాయుడు
అమరజీవి త్యాగం ఆదర్శనీయం
Comments
Please login to add a commentAdd a comment