ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కడప – చిత్తూరు జాతీయ రహదారిపై షెంఫోర్డ్ స్కూలు సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా శనివారం అర్థరాత్రి ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొంది. జమాలపల్లె గ్రామానికి చెందిన ఆరిఫ్, షేక్ అహ్మద్, అబ్దుల్లా గౌస్ అనే ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన హైవే పెట్రోలింగ్ రక్షక్ సిబ్బంది గాయపడిన వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
నూతన నియామకం
రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాలకు, పట్టణాలకు నూతన అధ్యక్షులకు నియామకపత్రాలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లాబకష్, పుంగనూరు ఇన్‌చార్జి మురళీయాదవ్, పీలేరు ఇన్‌చార్జి సోమశేఖర్‌రెడ్డి, రైల్వేకోడూరు ఇన్‌చార్జి గోశాల దేవి, పార్టీ సీనియర్ నాయకులు రామకష్ణారెడ్డి, రాయచోటి చెన్నకష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు వీరే : షేక్ ఆదిల్ (రాజంపేట పట్టణం), మహదేవయ్య (రాజంపేట రూరల్), సల్మాన్(టి.సుండుపల్లె), సుబ్బరాయుడు (ఒంటిమిట్ట), శ్రీనివాస్ (చిట్వలి), రమేష్ (పుల్లంపేట), జీవరత్నం (పెనగలూరు), హరిక్రిష్ణారెడ్డి(ఓబులవారిపల్లె)ను నియమించారు. అలాగే బాబాసర్దార్ (రాయచోటి పట్టణం), నాగార్జున (లక్కిరెడ్డిపల్లె), గణేష్ (రామాపురం), సుబ్బయ్య (సంబేపల్లె), షబ్బీర్‌ఖాన్ (చిన్నమండెం), పీలేరు నియోజకవర్గంలో ఫిరోజ్ (గుర్రంకొండ), సాంబశివ (వాయల్పాడు), శ్రీకాంత్( పీలేరు), మదనపల్లె నియోజకవర్గంలో సతీష్‌రెడ్డి (రామసముద్రం), శేఖర్ (నిమ్మనపల్లె) లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా నియమించారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
Comments
Please login to add a commentAdd a comment