●ముగ్గురాయి లూటీ.. మౌనరాగమే అధికారుల డ్యూటీ!
వేంపల్లె: పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు అక్రమ మైనింగ్‌లతో చెలరేగుతున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు , లైసెన్స్ మాటే లేకుండా మైనింగ్ కార్యకలాపాలను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లె మండలాల్లో టీడీపీ నాయకుల దందా జోరుగా సాగుతోంది. వీరికి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక అక్రమ మైనింగ్‌లో టీడీపీ బడా నాయకులకు వాటాలు కూడా వెళుతున్నట్లు సమాచారం. ఇటీవలే సంక్రాంతి పండుగ రోజు టిఫెన్ కంపెనీకి చెందిన దాదాపు రూ.15కోట్ల విలువైన ముగ్గురాయిని రాత్రికి రాత్రే వేముల మండలానికి చెందిన టీడీపీ నాయకుడు తరలించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై టిఫెన్ కంపెనీ వారు పోలీసులకు, మైనింగ్ అధికారులకు సాక్ష్యా లతో సహా ఫిర్యాదు చేసినా వారి నుంచి స్పందన లేకుండా పోయింది.
మైనింగ్ పనులు చేపడుతూ వ్యక్తి మృతి..
వేంపల్లె మండలం కత్తులూరు గ్రామ సమీపంలో మైనింగ్ పనులు చేపడుతూ మంగళవారం ప్రమాదవశాత్తు చిట్టిబోయిన రామచంద్ర(55) మృతి చెందాడు. మృతుడు వేముల మండలం అమ్మయ్యగారి పల్లె గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. రోజులాగే ముగ్గురాయి పనులకు వెళ్లిన చిట్టిబోయిన రామచంద్రపై ఒకసారిగా మట్టి ఉళ్లి పడింది. ఆ మట్టిలో రామచంద్ర కురుకుపోయాడు. జరిగిన విషయాన్ని మృతుని బంధువులకు సమాచారమివ్వడంతో కుమారుడు రాజశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని వెలికి తీశారు. అప్పటికే మట్టిలో కూరుకుపోయిన తండ్రి రామచంద్ర మృతి చెందాడు. వేముల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సంఘటన స్థలాన్ని వేంపల్లె సీఐ సురేష్ రెడ్డి, వేముల ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.
●ముగ్గురాయి లూటీ.. మౌనరాగమే అధికారుల డ్యూటీ!
Comments
Please login to add a commentAdd a comment