జెడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
కడప సెవెన్‌రోడ్స్: కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 23న జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు ఉద్దేశించిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు కోసం నోటీసు జారీ చేస్తారు. ఈ నోటీసు జెడ్పీ సభ్యులందరికీ అధికారులు అందజేయాల్సి ఉంటుంది. ఈనెల 27వ తేది ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఆరోజు ఉదయం 10 గంటల ముందు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 12.00 గంటల్లోపు స్క్రూటినీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అర్హతగల నామినేషన్ల జాబితా విడుదల చేస్తారు. 1 గంటవరకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఆపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. సమావేశం ముగిసిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. ఏదైనా కారణాల వల్ల ఆరోజు ఎన్నిక జరగకపోతే మరుసటిరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఉమ్మడి కడపజిల్లాలోని ఖాజీపేట, ఒంటిమిట్ట, రాయచోటి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన ఆకేపాటి అమర్‌నాథరెడ్డి రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొందడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం ఇన్‌చార్జి చైర్ పర్సన్‌గా జేష్ఠాది శారద వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లా పరిషత్‌కు కొత్త అధ్యక్షుడు ఎన్నిక కానుంది.
Comments
Please login to add a commentAdd a comment