విద్యుత్ మీటర్ రీడర్ల నిరసన
ప్రొద్దుటూరు : స్థానిక విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద మంగళవారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మీటర్ రీడర్లు నిరసన తెలిపారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ మీటర్ రీడర్స్‌కు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలన్నారు. అనంతరం వారు ఏపీఎస్‌పీడీసీఎల్ ఈఈ రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు సబ్ డివిజన్ యూనియన్ నాయకులు శ్రీనివాసులు, సుధాకర్, సురేష్, రమణ, శేఖర్, ప్రసాద్, పవన్‌కుమార్, లక్ష్మీనారాయణ, సుబ్బారెడ్డి, రమణ, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.
మండుతున్న కొండలు
– వృక్ష సంపద అగ్నికి ఆహుతి
పులివెందుల రూరల్ : అడవికి నిప్పు పెట్టడంతో మానవాళికి ముప్పు కలుగుతోంది. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, చక్రాయపేట, వేముల, పులివెందుల మండలాల్లోని కొండలు అగ్నికి ఆహుతి కావడంతో వృక్ష సంపద కనుమరుగవుతోంది. రేయింబవళ్లు కొండలపై మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. కొండ, గుట్ట ప్రాంతా లలో కొంతమంది వ్యక్తులు కొండలకు నిప్పు పె ట్టడంతో కొండలు, గుట్ట ప్రాంతాల్లో ఉన్న వృక్ష సంపద ఎందుకు పనికిరాకుండా పోతోంది. ఆకతాయిలు కొండలకు నిప్పు పెట్టడంతో వృక్ష సంపదతోపాటు వన్య ప్రాణులకు తీవ్ర నష్టం జరుగుతోంది. దీనిపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించి అటవీ సంపదను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాకు 5500 ఫారం
పాండ్స్ మంజూరు
చక్రాయపేట : జిల్లాకు కొత్తగా 5500 ఫారం పాండ్స్ మంజూరయ్యాయని డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక సీ్త్ర శక్తి భవనం వద్ద జరిగిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన ఓపెన్ ఫోరం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చక్రాయపేట మండలంలో సామాజిక తనిఖీ బృందం పరిశీలన సందర్భంగా రూ.55,227 రికవరీ చేశామన్నారు. జిల్లాకు మంజూరైన 5500 ఫారం పాండ్స్‌ను మార్చి నుంచి జూన్ వరకు నెలకు 1400 చొప్పున పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేశామని చెప్పారు. ఈనెల 22న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫారం పాండ్లకు సంబంధించి భూమి పూజ చేస్తారన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ అధికారి భాస్కర్, ఏపీడీ సోమశేఖరరెడ్డి, డీవీవీఓ రామలింగేశ్వరరెడ్డి, ఏఓ వెంకటరమణ, ఎస్‌ఆర్‌పీ భాస్కర్, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు
విద్యుత్ మీటర్ రీడర్ల నిరసన
విద్యుత్ మీటర్ రీడర్ల నిరసన
Comments
Please login to add a commentAdd a comment