ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఏపీఎస్ ఆర్టీసీ కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు తెలిపారు. మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు పలు అంశాలను డీఎం దృష్టికి తీసుకు వచ్చారు. దువ్వూరుకు కడప నుంచి నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని ఓ ప్రయాణికుడు కోరారు. అలాగే కృష్ణాపురంలో స్టేజ్ ఏర్పాటు చేయాలని, ఒంగోలుకు ఎక్స్‌ప్రెస్ బస్సు నడపాలని, విజయవాడకు కావలి మీదుగా బస్సు ఏర్పాటు చేయాని మరికొందరు కోరారు. చిత్తూరుకు ప్రస్తుతం నడుస్తున్న బస్సులకు తోడు అదనపు సర్వీసులు ఏర్పాటు చేయడంతోపాటు టైమింగ్ అప్డేట్ చేయాలన్నారు. శ్రీశైలంకు ఎక్స్‌ప్రెస్ కాకుండా సూపర్ లగ్జరీ బస్సు నడపాలన్నారు. పామూరుకు బస్సు ఏర్పాటు చేయాలని, ఎర్రగుంట్లకు సాయంత్రం 6 తరువాత బస్సు ఏర్పాటు చేయాలని, సబ్ జైలు దగ్గర బస్ షెల్టర్ ఆక్రమణలు తొలగించాలన్నారు. బస్టాండులో వివిధ వస్తువులను అధిక ధరలకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.ఖాజీపేట బస్సు స్టేషన్‌లో దెబ్బతిన్న కుర్చీలను బాగు చేయాలని, బస్సులు ఆపని సిబ్బందిపై చర్య తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment