దూరవిద్య కోర్సుల ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
డైరెక్టర్ ఆచార్య కృష్ణారెడ్డి వెల్లడి
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీవోఈ) ద్వారా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ ప్రొఫెసర్ కె. కృష్ణారెడ్డి తెలిపారు. బుధవా రం ఆయన ప్రిన్సిపల్ ఎస్ రఘునాథరెడ్డి, రిజిస్ట్రా ర్ ప్రొఫెసర్ పి.పద్మ తో కలిసి మాట్లాడారు. యోగి వేమన విశ్వవిద్యాలయం గుర్తింపునిచ్చిన అధ్యయన కేంద్రాల్లో ఎంఏ ఎకనామిక్స్, ఇంగ్లిష్, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, తెలుగు, ఎం కామ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. బ్యాచిలర్ డిగ్రీలో ఎకనామిక్స్ చదివిన వా రికి మాత్రమే ఎంఏ ఎకనామిక్స్ లో ప్రవేశాలు ఉంటాయని అలానే బీకాం, బీబీఏ, బీబీఎం డిగ్రీ చేసిన వారు ఎంకామ్‌లో ప్రవేశాలకు అర్హులన్నారు. మిగిలిన అన్ని కోర్సులకు ఏదేని డిగ్రీ పాసైతే చాలన్నారు. ఈ ఏడాది నూతనంగా బ్యాచిలర్ ఆఫ్ ఫైనార్ట్స్ (బీఎఫ్‌ఏ ఆనర్స్) మ్యూజిక్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించామన్నారు. ఈ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్, సమాన అర్హత గల వారు ప్రవేశానికి అర్హులన్నారు. ఈ కోర్సులన్నీ డిస్టెన్స్, ఆన్లైన్ లర్నింగ్ విధానంలో ఉంటాయన్నారు. వివరాలకు https://code.yvu.edu.inను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment