ఏనుగు దాడిలో మృతుల కుటుంబాలకు సాయం
ఓబులవారిపల్లె : శివరాత్రి సందర్భంగా తల కోన కు కాలినడకన వెళ్తూ వై.కోట సమీపంలో ఏనుగల దాడిలో మృతిచెందిన కుటుంబాలకు ము క్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా ముక్కా వరలక్ష్మీ గురువారం ఆర్థికసాయం అందజేశారు. రైల్వేకోడూరు మండలం బుడుగుంటపల్లి పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన మృతురాలు తుపాకుల మణెమ్మ, తిరుపతి చెంగల్ రాయుడు, ఉర్లగడ్డపోడు వంకాయల దినేష్ కుమార్ కుటుంబీకులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కులను ము క్కా వరలక్ష్మీ అందజేశారు. ముక్కా వరలక్ష్మీ మా ట్లాడుతూ మృతుల కుటుంబాలకు అన్ని విధాలు గా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ
రాజంపేట టౌన్ : పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఓ లారీ గురువారం డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అదుపుతప్పి కింద పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కడప–తిరుపతి మార్గంలో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. బైపాస్ రోడ్డు కావడంతో వేగంగా వెళ్తుంటాయి. లారీ కింద పడి ఉంటే వెనుకవైపు వచ్చే వాహనాలు ఢీకొని పెనుప్రమాదం జరిగేదని, ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. డివైడర్ ఎత్తు పెంచాలని వాహనదారులు కోరారు.
ఇసుక రవాణాకు అడ్డుకట్ట
వీరబల్లి : మండలంలోని పెద్దవీటి పంచాయతీ ఎలకచెట్టుపల్లి వంతెన, రాగిమాను దిన్నెపల్లి వద్ద మాండవ్య నదిలో ట్రాక్టర్లతో నిత్యం ఇసుక తరలిస్తున్నారు. ఇసుక రవాణా ట్రాక్టర్లను నదిలోకి వెళ్లనీయకుండా రాగిమానుపల్లి గ్రామస్తులు గురువారం నిలిపివేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ కొందరు నాయకుల సహకారంతో ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోయి తాగడానికి నీరు దొరకకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దారు వెంకటేష్‌కు ఫోన్ ద్వారా తెలుపగా ఇసుక రవాణాను నిలిపవేయాలని సిబ్బందికి సూచించారు.
అటవీ భూమి కబ్జా
చిన్నమండెం : మండలంలో ఆక్రమణదారులు పేట్రేగిపోతున్నారు. చిన్నర్సుపల్లె కొండ కింద కింద ఉన్న అటవీ భూమిని జేసీబీతో చదును చేయిస్తున్నా.. స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. వివరాల్లోకి వెళితే.. చిన్నమండెం మండలం చాకిబండ చెరువు వద్ద చిన్నర్సుపల్లె కొండ కింద అటవీ భూమి ఉంది. మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వారం రోజులుగా యథేచ్ఛగా ఆక్రమణకు పాల్పడుతున్నా అటవీ అధికారులు స్పందించడం లేదు. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.
హద్దులు దాటిన..
డ్యాన్స్
కురబలకోట : ముదివేడు అమ్మవారి తిరునాలలో డ్యాన్స్ హద్దులు దాటింది. భక్తి భావం ఉప్పొంగాల్సిన చోట అసభ్యకర నృత్యంతో హోరెత్తించారు. కురబలకోట మండలం ముదివేడు దండుమారెమ్మ రాత్రి తిరునాల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించకూడదని ముందస్తుగా పోలీసులు హెచ్చరించినా కొందరు ఖాతరు చేయలేదు. మండలంలోని నడింపల్లె, గోల్లపల్లె గ్రామాల్లో బుధవారం రాత్రి హద్దులు దాటి యథేచ్ఛగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. ఈ దృశ్యాలను కొందరు సెల్ ఫోన్‌లో రికార్డ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకుని చాందినీబండి నిర్వాహకుడు నడింపల్లె అశోక్‌పై వివిధ సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ గురువారం తెలిపారు. వారు ఉపయోగించిన డీజే సౌండ్ సిస్టమ్, ఇతర వాహనాలను సీజ్ చేసి కందూరుకు చెందిన కార్తీక్, డిజే వెహికల్ డ్రైవర్ గురునాథ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
● ముదివేడు తిరునాలలో రికార్డింగ్ డ్యాన్సులు
● ముగ్గిరిపై కేసు నమోదు...వాహనాలు సీజ్
Comments
Please login to add a commentAdd a comment