ఉత్తమ ఫ్యాకల్టీతో డీటీసీలో శిక్షణ
ఇ–క్లాస్ రూమ్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్
కడప అర్బన్ : ఉత్తమ ఫ్యాకల్టీతో జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం(డీటీసీ)లో నిర్వహించే శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్ అన్నారు. కడప నగర శివారులోని డీటీసీలో అత్యాధునిక ప్రొజెక్టర్, పరికరాలు, ఏసీ గదులతో ఏర్పాటు చేసిన ఇ–క్లాస్ రూమ్‌ను ఎస్పీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటూ వివిధ అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. భవిష్యత్తులో ఉపయుక్తంగా ఉండేలా రూపొందించిన మెటీరియల్ శిక్షణ కాలంలో అందిస్తారన్నారు. వేసవి నేపథ్యంలో సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఇ–క్లాస్ రూమ్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన డీటీసీ డీఎస్పీ అబ్దుల్‌కరీంను ఆయన అభినందించారు. అనంతరం భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను నిపుణులు సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్‌బాబు, ఏఎస్పీ(ఏఆర్) బి.రమణయ్య, డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్.వినయ్‌కుమార్‌రెడ్డి, టి.రెడ్డెప్ప, దారెడ్డి భాస్కర్‌రెడ్డి, సీతారామిరెడ్డి, శివరాముడు, మహమ్మద్‌బాబా, మధుమల్లేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment