
● కవర్లు తొడగడం వల్ల లాభాలు
కాయ ఎదిగే దశలో కవర్లు తొడగడం వల్ల ఆ దశలో ఆశించే పురుగులు తీగలు ఉంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా పండు ఈగ బారిన పడకుండా కాయలను కాపాడొచ్చు. అదే విధంగా అకాల వర్షాలతో వ్యాపించే మసి తెగులు, బ్యాక్టీరియా మచ్చ తెగులు, పక్షి కన్ను వంటి తెగుళ్లను కూడా ఎలాంటి శీలింధ్రనాసినులు సోకకుండా సమర్థవంతంగా అరికట్టవచ్చు. కవర్లు తొడిగిన మామిడికాయలు మంచి రంగు సంతరించుకుని ఎలాంటి మచ్చలు లేకుండా చూడడానికి ఆకర్షణీయంగా కనిపించి కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. కవర్లు తొడిగితే పురుగు మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు.
● మామిడి కాయలకు కవర్లను ఏర్పాటు చేయడం వల్ల రైతుకు ఖర్చు తగ్గుతుంది, దీంతోపాటు పురుగు మందులు కొట్టడం తగ్గడంతో హానికర పురుగుమందుల్లో అవశేషాలు పండులో ఉండవు. దీంతో పండు తిన్నవారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు.
● కవర్లు తొడగడం వల్ల పక్షుల నుంచి కలిగే నష్టాన్ని నివారించవచ్చు. కాయ పెరిగే దశలో వచ్చే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు లేదా అకాల వర్షాలతో కలిగే నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. కవర్లు తొడగడం వల్ల కాయలపై కొనతో ఏర్పడే మచ్చలను నివారించవచ్చు. కవర్లు తొడిగిన కాయలు త్వరగా పక్వానికి వస్తాయి. కోసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మార్కెట్లో అధిక ధర వస్తుంది. రైతుకు ఎక్కువ ఆదాయం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment