
కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి
పులివెందుల: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో జిల్లా మేనేజరు, టీం లీడర్, ఆఫీస్ అసోసియేట్, ఆరోగ్యమిత్ర, సీసీడీఈఓ గత 17 ఏళ్లుగా పరిష్కారం చూపని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం సోమవారం విధులను బహిష్కరించి అన్ని జిల్లాల్లోని జిల్లా సమన్వయకర్త డీసీ ఆఫీసుల వద్ద నిరసన తెలుపుతున్నారని ఎన్‌టీఆర్ వైద్య సేవ రాష్ట్ర యూనియన్ కమిటీ సభ్యుడు నాగార్జునరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ సిబ్బందికి సంబంధించిన 17 ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి కేటగిరి 1 డీపీఓ క్యాడరు అమలు, కనీస వేతనం అమలు చేయాలన్నారు. ఉద్యోగి చనిపోయిన కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియో, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలలో వెయిటేజీ కల్పించాలన్నారు.
‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’లో పని చేస్తున్న సిబ్బంది తమ సమస్యల పరిష్కారానికి విధు లను బహిష్కరించి ఆందోళన చేపడుతున్నా.. పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో అటు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇటు సిబ్బంది వైద్యం అందించడం లేదు. దీంతో ఉచిత ‘వైద్య సేవ’ గాలిలో దీపంలా మారింది.
● ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’ సిబ్బంది ఆందోళన
● నేడు వైద్య సేవలు బంద్
● 27న కూడా నిరసన.. విధుల బహిష్కరణ
● అటు ‘వైద్య సేవ’ సిబ్బంది.. ఇటు ‘పేదలఉచిత వైద్యం’ను పట్టించుకోని ప్రభుత్వం

కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి

కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి
Comments
Please login to add a commentAdd a comment